కరోనా భయంతో దూరంగా గ్రామస్థులు…చిన్నారి అంత్యక్రియలు నిర్వహించిన అధికారి

  • Published By: venkaiahnaidu ,Published On : May 30, 2020 / 09:42 AM IST
కరోనా భయంతో దూరంగా గ్రామస్థులు…చిన్నారి అంత్యక్రియలు నిర్వహించిన అధికారి

నాలుగు నెలల శిశువు మరణానికి కరోనానే కారణమని భావించి తన అంత్యక్రియులు చేసేందుకు రాజస్థాన్ లో చవాండీ గ్రామస్థులు నిరాకరించారు. అయితే విషయం తెలుసుకున్న భిల్వారా జిల్లాలోని ఓ సబ్ డివిజినల్ ఆఫీసర్(SDO) చిన్నారి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.

చనిపోయిన పసిబిడ్డ తండ్రికి ఇటీవలే కరోనా సోకినట్లు తేలింది. అయితే బుధవారం సాయంత్రం డయోరియా కారణంగా డీహైడ్రేషన్ తో చిన్నారి చనిపోయిన చిన్నారి చావుకు కరోనానే కారణమని గ్రామస్థులు అనుమానపడి…ఆ బిడ్డ అంత్యక్రియలు నిర్వహించడకుండా అలాగే వదిలేశారు. గురువారం మధ్యాహ్నాం వరకు ప్రాణాలు కోల్పోయి ఇంట్లోనే పడి ఉన్న ఆ బిడ్డ దగ్గరకు గ్రామస్థులు ఎవ్వరూ వెళ్లలేదు. 

విషయం తెలుసుకున్న కరేడా SDO మనిపాల్ సింగ్…గురువారం మధ్యాహ్నాం బాధిత చిన్నారి ఇంటికి చేరుకున్నారు. చిన్నారికి కరోనా నెగిటివ్ వచ్చినట్లు…బాధిత కుటుంబసభ్యులకు,గ్రామస్థులకు చెప్పారు. అయినప్పటికీ గ్రామస్థులు,చిన్నారి కుటుంబసభ్యుల్లో అనుమానాలు పోలేదు. చివరకు మనిపాల్ సింగ్ చనిపోయి పడిఉన్న పసిబిడ్డను తన చేతుల్లో తీసుకున్నారు.

పసిబిడ్డ మృతదేహాన్ని స్మశానవాటిక దగ్గరకు మోసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల సమయంలో పోలీస్,పాలన అధికారులు కూడా అక్కడ ఉన్నారు. తాను పసిబిడ్డను ఎత్తుకుని స్మశానానికి తీసుకెళ్తున్న క్రమంలో పలువురు గ్రామస్థులు కూడా ముందుకొచ్చారని,అంత్యక్రియలు నిర్వహించేందుకు సహాయపడ్డారని మనిపాల్ తెలిపారు. చిన్నారి కుటుంబంలోని ఇద్దరు కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నట్లు తెలిపారు. 

మనిపాల్ సింగ్ మాట్లాడుతూ…బాధిత చిన్నారి కుటుంబం మే-13న ముంబై నుంచి తమ స్వగ్రామమైన రాజస్థాన్ లోని చావండి గ్రామానికి చెందిన వచ్చారు. వాళ్ల కుటుంబాన్ని అధికారులు క్వారంటైన్ సెంటర్ లో ఉంచి కరోనా టెస్ట్ ల కోసం వాళ్ల దగ్గర నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. మే-23న బాధిత చిన్నారి తండ్రి సురేష్ కుమావత్ కు కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఆయనను అధికారులు భిల్వారాలోని MG హాస్పిటల్ లో చేర్చారు. మిగిలినవాళ్లను అధికారులు హోం క్వారంటైన్ కు పంపారు.

అయితే చిన్నారికి డయోరియా ఉన్న విషయాన్ని ఆ కుటుంబం హోం క్వారంటైన్ ఇన్ చార్జ్ కు తెలియజేయలేదు. బుధవారం చిన్నారి పరిస్థితి విషమించింది. దీంతో మా టీమ్ చిన్నారిని హాస్పిటల్ కు తీసుకెళ్లింది. అయితే అప్పటికే చిన్నారి మరణించినట్లు డాక్టర్లు దృవీకరించారని మనిపాల్ తెలిపారు. అయితే కరోనా హాట్ స్పాట్ ముంబై నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా చిన్నారికి కూడా కరోనా సోకి ఉండవచ్చని గ్రామస్థులు అనుమానించారని తెలిపారు. 

Read: పైలెట్ కు కరోనా…మాస్కోకు బయలుదేరిన విమానం తిరిగి ఢిల్లీకి