శ్రావణి హత్య కేసు : బొమ్మలరామారం SI పై వేటు

యాదాద్రి : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి (14) హత్య కేసుని పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసులో విచారణను స్పీడప్

  • Published By: veegamteam ,Published On : April 27, 2019 / 06:16 AM IST
శ్రావణి హత్య కేసు : బొమ్మలరామారం SI పై వేటు

యాదాద్రి : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి (14) హత్య కేసుని పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసులో విచారణను స్పీడప్

యాదాద్రి : సంచలనం రేపిన టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి (14) హత్య కేసుని పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసులో విచారణను స్పీడప్ చేసిన పోలీసులు.. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం ఎస్ఐ వెంకటేష్ పై వేటు వేశారు. కేసులో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో ఎస్ఐపై చర్యలు తీసుకున్నారు. హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ డీసీపీ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రావణిని హత్య చేసిన వారిని శిక్షించి న్యాయం చెయ్యాలంటూ ఏరియా ఆస్పత్రి ముందు కుటుంబసభ్యులు, గ్రామస్తులు ధర్నాకు దిగారు. కలెక్టరేట్ ముందు ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. జాతీయ రహదారిని దిగ్భందం చేస్తామని గ్రామస్తులు అంటున్నారు. ధర్నాకు సిద్ధమవుతున్న గ్రామస్తులకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.
Also Read : శ్రావణి హత్య కేసు : 5 టీంలతో దర్యాప్తు – డీసీపీ

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హజీపూర్‌లో దారుణం జరిగింది. స్పెషల్‌ క్లాసులకు వెళ్లిన 10వ తరగతి విద్యార్థిని శ్రావణి దారుణ హత్యకు గురైంది. బొమ్మలరామారం మండలం హజీపూర్‌కు చెందిన పాముల నర్సింహ కుమార్తె శ్రావణి.. మేడ్చల్‌ జిల్లా కీసరలోని సెరినిటీ ప్రైవేట్‌ స్కూల్‌లో 9వ తరగతి పూర్తి చేసింది. వారం రోజులుగా పదో తరగతి ముందస్తు తరగతులకు హాజరవుతోంది. 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు ఆర్టీసీ బస్సులో వెళ్లి వస్తుంది.

గురువారం (ఏప్రిల్ 25,2019) క్లాసులకు వెళ్లిన శ్రావణి ఇంటికి తిరిగిరాలేదు. రాత్రి వరకు ఎదురుచూసిన తల్లిదండ్రులు గ్రామస్తుల సహకారంతో ఊరంతా వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం (ఏప్రిల్ 26,2019) తెల్లవారుజామున గ్రామం సమీపంలోని ఓ పాడుబడ్డ బావిలో శ్రావణి మృతదేహాన్ని గుర్తించారు. దీంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు షాక్ తిన్నారు. శ్రావణిని ఎవరో కిరాతకంగా చంపేశారు. మృతదేహాన్ని బావిలో పడేశారు. శ్రావణిని చంపింది ఎవరు? ఎందుకు చంపారు? అనేది మిస్టరీగా మారింది.
Also Read : విద్యార్థిని శ్రావణి మర్డర్ : అట్టుడుకుతున్న హాజీపూర్