భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కత్తితో పొడిచి చంపాడు

సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో అల్లుడు అత్తను కత్తితో పొడిచి చంపాడు.

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కత్తితో పొడిచి చంపాడు

సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో అల్లుడు అత్తను కత్తితో పొడిచి చంపాడు.

సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో అల్లుడు అత్తను కత్తితో పొడిచి చంపాడు. ఈ సంఘటన హుజూర్‌నగర్ మండలం వేపల సింగారంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వేపలసింగారం గ్రామం మిట్టగూడేనికి చెందిన లలితకు మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన బొడ్డు అఖిల్(25)కు నాలుగు సంవత్సరాల క్రితం వివాహం అయింది. 2019, ఆగస్టు నెల 25వ తేదీన భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. అఖిల్ భార్యను కొట్టగా ఆమె తన పుట్టింటికి వెళ్లింది. 

2019, ఆగస్టు నెల 31వ తేదీన తన భార్యను తనతో పంపాలని అత్త నసాబోయిన కాశమ్మ(40)ను అడుగగా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అదే సమయంలో అఖిల్ తనతో తెచ్చుకున్న కత్తితో కాశమ్మను పొడిచి పారిపోయాడు. తీవ్ర గాయాలైన కాశమ్మను చికిత్స కోసం ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందారు. 

కాశమ్మ రెండో కుమార్తె భర్త సుధాకర్ ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు.

Also Read : ఇమ్రాన్ ఖాన్ కు షాక్ : ప్రధాని మోడీకి మద్దతు తెలిపిన పాక్ నేత