పోలీసులు ఆధ్వర్యంలో వ్యభిచార గృహం, బ్లాక్ మెయిలింగ్ – ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్

పోలీసులు ఆధ్వర్యంలో వ్యభిచార గృహం, బ్లాక్ మెయిలింగ్ – ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్

Two UP  cops run prostitution and bribe racket sexually abuse women : న్యాయన్ని ధర్మాన్ని రక్షించాల్సిన రక్షక భటులే భక్షక భటులయ్యారు. ఉత్తర ప్రదేశ్లో లోని ఫిలిబిత్ పోలీసు స్టేషన్ పరిధిలో పనిచేసే కానిస్టేబుళ్లు ఇద్దరు, యువతులను భయపెట్టి లొంగదీసుకుని వారి ద్వారా వ్యభిచారం చేయిస్తున్నారు. వారి వద్దకు విటులను రప్పించి వారు సన్నిహితంగా ఉన్నప్పుడు గదిలోకి పోలీసు అవతారంతో ఎంటరై వారిని బెదిరించి, భయపెట్టి దొరకినంత దోచుకోవటం మొదలెట్టారు. పోలీసుల బారిన పడిన యువతి విడుదల చేసిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిందితులైన పోలీసులు ఇద్దరిని జిల్లాఎస్పీ సస్పెండ్ చేశారు.

ఉత్తర ప్రదేశ్ లోని ఫిలిబిత్ జిల్లాలో ఓ పోలీసు అతిధి గృహం ఉంది. అక్కడ ఇద్దరు కానిస్టేబుళ్లు కాపలా ఉండేవారు. ఆ ప్రాంతంలో అనుమానంగా సంచరించే ఆడవారిని వీరు ప్రశ్నలతో వేధించేవారు. వాళ్లలో ఎవరైనా కాస్త భయపడినట్లు కనపడితే వారిని మరింత భయపెట్టి తమ దారిలోకి తెచ్చుకునేవారు. తాము చెప్పినట్లు వినాలని డిమాండ్ చేసేవారు. అలాంటి వారితో ఏకంగా సెక్స్ రాకెట్ ను తయారు చేసారు.

వీరి ద్వారా యువకులను, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను ఆకర్షించేలా చేయించేవారు. వారు పోలీసు అతిధి గృహం వద్దకు వచ్చేలా చేసేవారు. విటులు అక్కడకు రాగానే యువతులు వారితో సన్నిహితంగా మెలిగేవారు. ఆ సనయంలో పోలీసులిద్దరూ రైడ్ చేసేవాళ్లు. అమ్మాయిలతో రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయే సరికి యువకులు, వ్యాపారవేత్తలు హడలి పోయేవారు.

పోలీసులు అడిగినంత ఇచ్చుకుని అక్కడి నుంచి బతుకుజీవుడా అనుకుంటూ బయటపడేవారు. వీరు కొంతకాలంగాఈ దందాను నిర్వహిస్తున్నారు. వీరి ఆగడాలను భరించలేని ఒక మహిళ తన ఆవేదననను ఆడియో రూపంలో బయట పెట్టింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది జిల్లా ఎస్పీ జైప్రకాష్ యాదవ్ దృష్టిలోకి వెళ్లింది. వెంటనే ఆయన ఈ ఘటనపై నిచారణన చేపట్టాలని ఆదేశించారు.

పోలీసులు నిర్వహిస్తున్న వ్యభిచారం, బ్లాకె మెయిలింగ్ నిజమని తేలటంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న విపిన్ మిశ్రా (23), సచిన్ మిశ్రా (22) లను సస్పెండ్ చేశారు. పోలీసు అతిధి గృహం వద్ద విధుల్లో అలసత్వం వహించిన మరి కొందరు పోలీసులను కూడా అక్కడి నుంచి బదిలీ చేశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది,