దారుణంగా కొట్టి, నాలుక కత్తిరించి గ్యాంగ్ రేప్

  • Published By: madhu ,Published On : September 27, 2020 / 09:07 AM IST
దారుణంగా కొట్టి, నాలుక కత్తిరించి గ్యాంగ్ రేప్

Gang-Raped : లక్నోలో దారుణం చోటు చేసుకుంది. 20 ఏళ్ల మహిళపై దారుణంగా దాడి చేసి నలుగురు వ్యక్తులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రభుత్వ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. నలుగురు వ్యక్తులు ఉన్నత కులానికి చెందిన వారుగా తెలుస్తోంది.



వీరిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. మహిళ శరీరంపై గాయాలున్నాయని, ఆమె నాలుక కూడా కత్తిరించబడి ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే..పోలీసులు మొదట్లో తమకు సహాయం చేయలేదని, కేసుపై నిలదీయడంతో స్పందించారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.



అయితే..ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. సెప్టెంబర్ 14వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుందని సమాచారం. తన తల్లి. సోదరి, అన్నయ్యలు గడ్డి కోయడానికి వెళ్లారని బాధితురాలి సోదరుడు చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత..అన్నయ్య వచ్చేశాడని, తల్లి, సోదరి దూరం దూరంగా కూర్చొని గడ్డి కోస్తున్నారన్నారు.



ఇదే సమయంలో…నలుగురు వ్యక్తులు వచ్చి..తన సోదరిని బలవంతంగా పక్కకు లాక్కొని వెళ్లారని తెలిపాడు. సోదరి కనిపించకపోవడంతో..తల్లి వెతికేందుకు ప్రయత్నించిందన్నారు. కొద్ది దూరంలో అపస్మారక స్థితిలో తన సోదరి కనిపించిందని, ఆమెపై అత్యాచారం జరిగిందన్నారు.



తొలుత పోలీసులు తమకు సహాయం చేయలేదని, నాలుగైదు రోజుల తర్వాత చర్యలు తీసుకున్నారని తెలిపారు.
ఈ కేసులో తాము వేగంగా పని చేశామని, నలుగురిని అరెస్టు చేయడం జరిగిందని హత్రాస్ పోలీస్ స్టేషన్ అధికారి ప్రకాష్ కుమార్ తెలిపారు.