wife, lover arrested : ఆమెకు 41, అతనికి 23, ప్రియురాలి సూచనతో ఆమె భర్తను చంపిన ప్రియుడు

వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ఆమె వయస్సు 41, అతని వయస్సు 23, వారిద్దరి ప్రేమకు వయస్సు అడ్డంకి కాలేదు, కానీ అమె భర్త అడ్డం అని భావించింది ప్రియురాలు. భర్తను చంపమని ప్రియుడ్ని కోరింది. ఆమె కోరినట్లే చేశాడు23 ఏళ్ళ ప్రియుడు.

wife, lover arrested : ఆమెకు 41, అతనికి 23, ప్రియురాలి సూచనతో ఆమె భర్తను చంపిన ప్రియుడు

Lover Klilled By Man

wife, lover arrested for conspiring to murder her husband in delhi : వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ఆమె వయస్సు 41, అతని వయస్సు 23, వారిద్దరి ప్రేమకు వయస్సు అడ్డంకి కాలేదు, కానీ అమె భర్త అడ్డం అని భావించింది ప్రియురాలు. భర్తను చంపమని ప్రియుడ్ని కోరింది. ఆమె కోరినట్లే చేశాడు23 ఏళ్ళ ప్రియుడు. అక్రమ సంబంధాల కారణంగా సమాజంలో కుటుంబ వ్యవస్ధ నాశనం అవుతోంది. కుటుంబాలు వీధిన పడుతున్నాయని తెలిసినా ప్రజలకు వీటిపై వ్యామోహం తగ్గటం లేదు.

ఢిల్లీలోని చిరాగ్ లో నివసిస్తూ కారు డ్రైవర్ గా జీవితం సాగిస్తున్న భీమ్ రాజ్(45)….. తన కారును విద్యుత్ సంస్ధలో కాంట్రాక్ట్ పద్దతిలో అద్దెకు తిప్పుతున్నాడు. మంగళవారం మార్చి 9, ఉదయం భీమ్ రాజ్ తన కారులో కూర్చుని ఉన్న సమయంలో హెల్మెట్ ధరించి, బైక్ పై వచ్చిన వ్యక్తి అతి సమీపం నుంచి అతడ్ని కాల్చి పరారయ్యాడు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి భీమ్ రాజ్ ను ఎయిమ్స్ కు తరలించి చికిత్స అందించసాగారు. మెడపై తీవ్ర గాయమైన భీమ్ రాజ్ చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భీమ్ రాజ్ భార్యను ప్రశ్నించారు. ఆమెనుంచి సరైన సమాధానం రాలేదు.

ఆ ప్రాంతంలో సీసీ టీవీ ఫుటేజి పరిశీలించగా నిందితుడు బైక్ పై వచ్చి కాల్చి చంపినట్లు గుర్తించారు. కానీ బైక్ నెంబర్ స్పష్టంగా తెలియక పోవటంతో విచారణ ఆలస్యం అయ్యింది. విచారణలో నిందితుడు పోలీసులను ముప్ప తిప్పలుపెట్టాడు. బైక్ నెంబర్ సరిగా తెలియకపోవటం, సాక్ష్యులు ఎవరూ సరైన సమాచారం ఇవ్వకపోవటంతో ..పోలీసులు ఇన్యురెన్స్ పత్రాల ఆధారంగా బైక్ ను గుర్తించగలిగారు.

ఆ బైక్ రాణా ప్రతాప్ నగర్ కు చెందిన వ్యక్తిదిగా గుర్తించారు. ఆ వ్యక్తిని విచారించగా బైక్ గతంలోనే కమల్ నగర్ కు చెందిన లఖన్ కు అమ్మి వేసినట్లు చెప్పాడు. పోలీసుల లఖన్ ను గుర్తించగా అతను కూడా బైక్ ను గోవిందపూర్ కుచెందిన రోహన్ అనే వ్యక్తికి విక్రయించినట్లుచెప్పాడు.

అక్కడ నుంచి పోలీసులు రోహన్ ను విచారించటానికి ప్రయత్నించగా అతని ఆచూకి లభ్యం కాలేదు. కానీ రోహన్ తన బైక్ ను వేరే ప్రదేశంలో పార్క్ చేసి. ఇంకో బైక్ మీద హెల్మెట్ పెట్టుకుని తిరుగుతున్నట్లు పోలీసులు తెలుసు కున్నారు. మొత్తానికి పోలీసులు రోహన్ ను అదుపులోకి తీసుకున్నారు.

రోహన్ పోలీసులను తప్పుదోవ పట్టించాలని చూశాడు. భీమ్ రాజ్ తో రోడ్డుపై గొడవ పడ్డానని అందుకనే కాల్చి చంపినట్లు చెప్పాడు. పోలీసులకు అతని మాటలు నమ్మశక్యంగా కనిపించలేదు. అతని ఫోన్ స్వాధీనం చేసుకుని అందులోని కాల్ లిస్ట్ ఆధారంగా పోలీసులు పరిశోధన ప్రారంబించారు. పోలీసులు అనుమానం బలపడింది. భీమ్ రాజ్ భార్య బబితకు, రోహన్ తన ఫోన్ నుంచి చేసిన ఫోన్ కాల్స్ బయటపడ్డాయి. పోలీసులు తమ దైన స్టైల్లో విచారించే సరికి నిజం చెప్పాడు.

భీమ్ రాజ్ భార్య బబిత(41) రోహన్ (23) తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. నాలుగు నెలలుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఈ విషయం ఆమె భర్త భీమ్ రాజ్ కు తెలిసి ఆమెను పద్ధతి మార్చుకోమని హెచ్చరించాడు. అయినా ఆమె పద్ధతి మార్చుకోకుండా రోహన్ తో సంబంధం కొనసాగిస్తూనే ఉంది. భార్య ప్రవర్తనతో విసుగు చెందిన భీమరాజ్ ఒక రోజు తన భార్యను చితక్కొట్టాడు.

భర్త చేతిలో దెబ్బలు తిన్న బబిత ఇంక భర్త ఊరుకోడని గ్రహించింది. భర్త అడ్డుగా ఉంటే రోహన్ తో ప్రేమ కలాపాలు సాగించలేనని భావించింది. భర్తను తుదముట్టించమని ప్రియుడు రోహన్ ను కోరింది. ప్రియురాలు బబిత సూచన మేరకు రోహన్ భీమ్ రాజ్ ను కాల్చి చంపినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. పోలీసులు బబితను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.