వీడు వార్డ్ బోయ్ కాదు…. వరస్ట్ బోయ్

  • Published By: murthy ,Published On : June 10, 2020 / 07:30 AM IST
వీడు వార్డ్ బోయ్ కాదు…. వరస్ట్ బోయ్

చదివింది 9వ తరగతి….చేసేది వార్డ్ బాయ్ ఉద్యోగం… బుద్ది మాత్రం వరెస్ట్..తాను నగ్నంగా ఉంటూ ఆడవాళ్లకు వీడియోకాల్ చేసి వాళ్లను లైంగికంగా వేధిస్తాడు. వీడియో కాల్ స్క్రీన్ షాట్ తీసి వారికి పంపించి వారిని బెదిరింపులకు గురి చేస్తాడు. వారిని లైంగికంగా లోంగ తీసుకుని వారితో శృంగార కార్యకలాపాలు చేస్తాడు.

వయస్సుకు చిన్నవాడైనా, సోషల్ మీడియా వాడకంలో దిట్ట. వాట్సప్ ఫేస్ బుక్, వంటి సామాజిక మాధ్యమాల టెక్నాలజీలో కొట్టిన పిండి. గత 3 ఏళ్లలో దాదాపు 200 మంది దాకా అమాయక యువతులు వీడి ఆగడాలకు బలైపోయారు. చివరికి ఒక యువతి ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వీడి ఆగడాలకు  అడ్డుకట్టపడి జైలు పాలయ్యాడు.

వరంగల్ జిల్లా చెన్నారావు పేటకు చెందిన పార్శ అఖిల్ అలియాస్ చందు 9 వ తరగతి వరకు చదువుకున్నాడు. జల్సాలకు, చెడు వ్యసనాలకు అలవాటు పడిన అఖిల్ మూడేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చాడు. సికింద్రాబాద్ అడ్డగుట్టలోని ఒక హోమ్ కేర్ సెంటర్లో వార్డు బాయ్ గా చేరి అక్కడే నివాసం ఉంటున్నాడు. 

హోమ్ కేర్ సెంటర్లో పనిచేసే నర్సులు, ఇతర మహిళా ఉద్యోగినులు ఫోన్ నెంబర్లు చాక చక్యంగా సేకరించేవాడు. తర్వాత  తాను నగ్నంగా ఉండి వారికి వీడియో కాల్ చేసేవాడు. వారు ఫోన్ ఎత్తగానే ఆ వెంటనే స్క్రీన్ షాట్ తీసుకునేవాడు. తర్వాత ఆ ఫోటోలను వారికి వాట్సప్ లో పంపించి బ్లాక్ మెయిల్ చేసేవాడు. నకిలీ ఫోటోతో ఫేసు బుక్  నకిలీ ఎకౌంట్ క్రియేట్ చేసి దాంతో అమ్మాయిలకు రిక్వెస్ట్ పంపించేవాడు.వారు పరిచయం కాగానే  వారి ఫోన్ నెంబర్లు తీసుకుని వారికి వీడియో కాల్ చేసి వారినీ ఈ విధంగానే వేధించేవాడు.

మీకో సప్రైజ్ అంటూ చెపుతూ వారికి  వీడియోకాల్ చేసి, రిసీవ్ చేయాలని చెప్పేవాడు. ఏంటా సప్రైజ్అని యువతులు ఫోన్ ఎత్తే సరికి  నగ్నంగా కనిపిస్తూ…. తన సెల్ ఫోన్ లో వీడియా కాల్ రికార్డు, స్క్రీన్ షాట్ తీసుకునేవాడు. తర్వాత ఆ స్క్రీన్ షాట్లు యువతులకు పంపించి బ్లాక్ మెయిల్ చేయటం మొదలెట్టేవాడు. తన దగ్గర  మీ ఫోటోలు వీడియోలు ఉన్నాయని లైంగిక కోరిక తీర్చమని  బెదిరించేవాడు. 

అతని బెదిరింపులకు లొంగకపోతే ఈ పోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బ్లాక్ మెయిల్ చేసేవాడు.  దీంతో వీడి బెదిరింపులకు భయపడి  చాలామంది యువతులు వీడి అకృత్యాలకు బలైపోయారు. ఎవ్వరూపోలీసులకు ఫిర్యాదు చేసే ధైర్యం చేయలేకపోవటంతో రానురానూ  వీడి ఆగడాలు ఎక్కవయ్యాయి. 

చివరికి  పోలీసులకు ఇలా చిక్కాడు
నల్గోండ పట్టణంలోని ఒక వృధ్ద మహిళకు సేవ చేసేందుకు అడ్డగుట్ట  హోమ్ కేర సెంటర్ నుంచి ఒక నర్సు వచ్చింది. ఆమె నల్గోండ వచ్చినప్పటినుంచి  అఖిల్ ఆమెను వేధించసాగాడు.  అతడి అకృత్యాలకు విసిగి పోయిన ఆమె నల్గోండలోని షీ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

రంగంలోకి దిగిన పోలీసులు పకడ్బందీ వ్యూహంతో … బాధిత నర్సు సహకారంతో అఖిల్ ని నల్గోండ రప్పించారు. నల్గోండ రాగానే అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారించగా  ఎందరో అమాయక యువతులను వేధింపులకు గురిచేసినట్లు ఒప్పకున్నాడు.  అఖిల్ పై జంటనగరాల్లోని పలు పోలీస్ స్టేషన్లలో దొంగతనాలు, మహిళలపై వేధింపుల కేసులు కూడా నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. 

Read: కూతుర్ని ప్రేమిస్తున్నాడని దళిత యువకుడ్నికొట్టి చంపేసిన కుటుంబం