Blood Pressure : రక్తపోటును తగ్గించడంలో సహాయపడే ఆహారాలు !

గుమ్మడికాయ గింజలు, అవిసె గింజ, చియా సీడ్, పిస్తాపప్పులు, అక్రోట్లు, బాదంపప్పులు వంటి అనేక గింజలు, విత్తనాలు ఫైబర్ ,అర్జినైన్‌తో రక్తపోటు నియంత్రణకు ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటాయి.

Blood Pressure : రక్తపోటును తగ్గించడంలో సహాయపడే ఆహారాలు !

blood pressure

Blood Pressure : అధిక రక్తపోటు అన్నది గుండె జబ్బులకు కారణమయ్యే అత్యంత సాధారణ ప్రమాద కారకం. ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ మందికి పైగా ప్రజలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. జీవనశైలి, ఆహార మార్పులు రక్తపోటు స్థాయిలలో మార్పులకు కారణమై చివరకు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతున్నాయి. ఆహారంలో కొన్ని ఆహారాలను చేర్చడం ద్వారా ముఖ్యంగా పొటాషియం, మెగ్నీషియం వంటి వాటిని తీసుకోవటం వల్ల రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

READ ALSO : Sweet Corn : మలబద్ధకం సమస్యను పోగొట్టే స్వీట్ కార్న్ !

అధిక రక్తపోటు తగ్గించటం కోసం ఉత్తమ ఆహారాలు ;

1. సిట్రస్ పండ్లు ;

సిట్రస్ పండ్లు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. అవి విటమిన్లు, ఖనిజాలు మరియు మొక్కల సమ్మేళనాలతో నిండి ఉంటాయి. అధిక రక్తపోటు వంటి గుండె జబ్బులకు సంబంధించిన ప్రమాద కారకాలను తగ్గించడం ద్వారా మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ద్రాక్షపండు, నారింజ, నిమ్మకాయలు వంటివి సిట్రస్ పండ్లుగా చెప్పవచ్చు. 2021 అధ్యయనం ప్రకారం రోజుకు 530 నుండి 600 గ్రాముల సిట్రస్ పండ్లను తినడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. నారింజ , ద్రాక్షపండు రసం తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. అయితే రక్తపోటుకు సంబంధించి మందులను వాడుతున్నవారు వైద్యుల సూచనలు, సలహాలు పాటించటం మంచిది.

READ ALSO : Eating Too Much Fish : చేపలను ఎక్కువగా తినడం వల్ల పేగు ఆరోగ్యంపై ప్రభావంపడుతుందా ?

2. చేపలు ;

ఒమేగా -3 కొవ్వులు కొన్ని రకాల చేపలలో ఉంటాయి. వీటిని తీసుకోవటం వల్ల గుండెకు ప్రయోజనాలను కలుగుతాయి.. ఈ కొవ్వులు వాపును తగ్గించడం ద్వారా రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఆహారం లేదా సప్లిమెంట్స్ రూపంలలో ఒమేగా-3 కొవ్వులను తీసుకోవటం ద్వారా మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ఒమేగా-3 కొవ్వులు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. చేపలతో సహా ఆహారంలో అధిక ఒమేగా-3 కొవ్వు స్థాయిలు, గుండె జబ్బులు , మధుమేహం కలిగిన వారిలో అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

READ ALSO : ఈ వ్యాధి వస్తే.. దగ్గినా ఎముకలు విరిగిపోతాయి!

3.ఆకు కూరలు ;

ఆకు కూరలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఆకుకూరలు పొటాషియం , మెగ్నీషియం వంటి పోషకాలకు మూలం. బచ్చలికూర రక్తపోటును తగ్గించటం బాగా ఉపకరిస్తుంది. బచ్లలిలో నైట్రేట్ అని పిలువబడే మొక్కల ఆధారిత సమ్మేళనం అధికంగా ఉండే ఆకుకూర. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం కలిగి ఉంటుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. BPని తగ్గించడంలో అధిక-నైట్రేట్ ఆకు కూరలు ఏవిధంగా సహాయపడతాయన్న దానిపై ఇంకా లోతైన పరిశోధనలు జరగాల్సి ఉంది.

READ ALSO : Vangaveeti Radha Marriage: ఘనంగా వంగవీటి రాధా వివాహ వేడుక.. హాజరైన పవన్ కల్యాణ్, పలువురు ప్రముఖులు

4. గింజలు , విత్తనాలు ;

గింజలు , విత్తనాలు రక్తపోటు పై ప్రభావాన్ని చూపిస్తాయి. రక్తపోటును తగ్గించటంలో సమతుల్య ఆహారంలో భాగంగా గింజలు మరియు విత్తనాలు తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. గుమ్మడికాయ గింజలు, అవిసె గింజ, చియా సీడ్, పిస్తాపప్పులు, అక్రోట్లు, బాదంపప్పులు వంటి అనేక గింజలు, విత్తనాలు ఫైబర్ ,అర్జినైన్‌తో రక్తపోటు నియంత్రణకు ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటాయి. అర్జినైన్ అనేది నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేయడానికి అవసరమైన అమైనో ఆమ్లం, ఇది రక్తనాళాల సడలింపు, రక్తపోటును తగ్గించటంలో అవసరమైన సమ్మేళనం.

READ ALSO : Asaduddin Owaisi : రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసిన బీజేపీ.. అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

5.మూలికలు, సుగంధ ద్రవ్యాలు ;

కొన్ని మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలు శక్తివంతమైన సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఇవి రక్త నాళాలకు విశ్రాంతిని ఇవ్వటం ద్వారా రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. జంతు మరియు మానవ పరిశోధన ఫలితాల ప్రకారం రక్తపోటును తగ్గించడంలో సహాయపడే కొన్ని మూలికలు, సుగంధ ద్రవ్యాలకు సంబంధించి ఆకుకూరల విత్తనాలైన ధనియాలు, కుంకుమపువ్వు , నిమ్మగడ్డి, నల్ల మిరియాలు, వెల్లుల్లి, ఉల్లిపాయ పొడి, కారం పొడి,జీలకర్ర, ఎర్ర మిరియాలు, దాల్చిన చెక్క, ఏలకులు, తులసి, అల్లం వంటివి రక్తపోటును తగ్గించటం తోడ్పడతాయి. గుండె జబ్బులు వచ్చే ప్రమాద కారకాలు ఉన్న 71 మంది వ్యక్తులపై 2021లో జరిపిన ఒక అధ్యయనంలో, ప్రతిరోజూ 6.6గ్రాముల చొప్పున 24 రకాల మూలికలు, సుగంధ ద్రవ్యాలు కలిగిన మసాలా ఆహారాలు తక్కువ మోతాదులో ఇచ్చినప్పుడు రక్తపోటులో మార్పులను పరిశోధకులు గుర్తించారు.