Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి అనుసరించాల్సిన జీవనశైలి మార్పులు !

స్త్రీలకు వయస్సు వచ్చినప్పుడు, ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత వారు బరువు పెరగకపోయినా, బొడ్డులో విసెరల్ ఫ్యాట్ ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. పురుషులలో వయస్సు ,జన్యువుల ప్రభావంతో కొవ్వు పెరుగుతుంది.. అధికంగా ఆల్కహాల్ తాగడం వల్ల పురుషుల్లో బెల్లీ ఫ్యాట్ కూడా ఎక్కువ అవుతుంది.

Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి అనుసరించాల్సిన జీవనశైలి మార్పులు !

belly fat

Reduce Belly Fat :బొడ్డు కొవ్వు అనేది ఇతర కొవ్వు నిల్వలలో కన్నా అత్యంత ప్రమాదకరమైనది. తీవ్రమైన ఆరోగ్య ఇబ్బందులను కలిగిస్తుంది. ఇటీవలి కాలంలో చాలా మంది ఇంటర్నెట్ లో పొట్ట కొవ్వును త్వరగా తగ్గించుకోవడం ఎలా అనే విషయంపై ఎక్కువగా అన్వేషిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అంతర్గత అవయవాలను చుట్టుముట్టే కొవ్వును వదిలించుకోవడానికి ఎటువంటి సత్వరమార్గాలు లేవు. ఈ కొవ్వులు జీవక్రియను కష్టతరం చేసి జీవనశైలి వ్యాధులను కలిగిస్తుంది.. బొడ్డు కొవ్వు సమస్య ఊబకాయం ఉన్నవారికే మాత్రమే పరిమితం కాదు.

READ ALSO : Lose Fat : కొవ్వులు కరగాలంటే వారంలో ఒకరోజు కేలరీలు తగ్గిస్తే సరిపోతుందా?

ఖచ్చితమైన BMI కలిగిన వ్యక్తులు సైతం బొడ్డు చుట్టూ కొవ్వు సమస్యను కలిగి ఉన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి చర్యలను అనుసరించడం ద్వారా నెమ్మదిగా, ఖచ్చితంగా బొడ్డు కొవ్వును పోగొట్టుకోవచ్చు. నిద్రవేళల్లో మార్పు చేసుకోవటం మొదలు పోషకాహారమైన అల్పాహారం తీసుకోవడం వరకు బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోవడాన్ని వదిలించుకోవడానికి కొన్ని రకాల చర్యలు సహాయపడతాయి.

ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, నట్స్, చేపలు మొదలైన ముఖ్యమైన పోషకాలను తీసుకోవటం వంటి ఆహారపు అలవాట్లను వెంటనే మార్చుకోవటం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చు. చక్కెర కలిగిన స్నాక్స్,శుద్ధి చేసిన ధాన్యాలను తప్పనిసరిగా మీ ఆహారం నుండి మినహాయించాలి. ఎక్కువ సేపు అటుఇటు కదలకుండా కూర్చునే ఉండటం వల్ల బొడ్డు కొవ్వు సమస్య మరింత పెరుగుతుంది. ఉదయం సమయాన్ని 30 నిమిషాల వ్యాయామం, యోగా, ఇండోర్ ఏరోబిక్ వ్యాయామాలకు కేటాయించాలి.

READ ALSO : Abdomen Fats : అధిక బరువు, పొట్ట చుట్టూ కొవ్వులు బాధిస్తున్నాయా?

బొడ్డు కొవ్వు అంటే ఏమిటి?

బెల్లీ ఫ్యాట్ అనగా బొడ్డు,కడుపు లోపల, అవయవాల చుట్టూ, కాలేయం మరియు ప్రేగులతో సహా వాటి చుట్టూ ఏర్పడే కొవ్వును బెల్లీ ఫ్యాట్ అంటారు. సాధారణంగా పొత్తికడుపు కొవ్వు అని పిలవబడే కొవ్వు అన్నింటికంటే ప్రమాదకరం. పొత్తికడుపు కొవ్వు, స్థూలకాయుల్లో కనిపిస్తుంది. ఇతర శరీర రకాలతో పోల్చితే ఎక్కువ ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటుంది.

స్లిమ్‌గా ఉన్నా, పొట్ట చుట్టూ ఎక్కువ లావుగా ఉంటే ఏమవుతుంది ;

ఒక వ్యక్తికి పొత్తికడుపు చుట్టూ ఎక్కువ కొవ్వు ఉంటే అధిక బరువు లేకున్నా, హృదయ సంబంధ వ్యాధులు, టైప్ 2 డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్, కాలేయ వ్యాధి, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ.

READ ALSO : Fenugreek Water : కొవ్వును కరిగించటంతోపాటు, బరువు తగ్గించే మెంతుల నీరు! ఎలా తయారు చేసుకోవాలంటే ?

బెల్లీ ఫ్యాట్ డయాబెటిస్‌కు ఎలా కారణమవుతుంది ;

బెల్లీ ఫ్యాట్ ఉదర కుహరంలో పెరుగుతుంది. అవయవాల మధ్య ఖాళీ కొవ్వుతో నిండిపోతుంది. ఇది మన జీవక్రియను నెమ్మదిస్తుంది. ఇన్సులిన్ నిరోధకతను కలిగిస్తుంది. తద్వారా రక్తంలో చక్కెరను పెంచుతుంది. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.

బొడ్డు చుట్టూ కొవ్వు ఎలా పెరుగుతుంది?

అధిక కేలరీలు తీసుకోవటం, తక్కువ శారీరక శ్రమతో శరీరంలో కొవ్వు నిల్వలు పెరుగుతాయి. కొందరు వ్యక్తులు పొట్ట చుట్టూ కొవ్వును ఎక్కువగా కలిగి ఉంటారు. మరి కొంతమంది తుంటి చుట్టూ ఎక్కువగా కొవ్వును కలిగి ఉంటారు., ఇది వారి శరీర రకం, జన్యువులపై ఆధారపడి ఉంటుంది.

READ ALSO : Curry Juice : రక్తపోటును తగ్గించటంతోపాటు, పొట్ట కొవ్వులను కరిగించే కరివేపాకు జ్యూస్ !

పురుషులు, మహిళల్లో బొడ్డు కొవ్వు వల్ల ప్రమాదం ఎక్కువా ;

స్త్రీలకు వయస్సు వచ్చినప్పుడు, ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత వారు బరువు పెరగకపోయినా, బొడ్డులో విసెరల్ ఫ్యాట్ ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. పురుషులలో వయస్సు ,జన్యువుల ప్రభావంతో కొవ్వు పెరుగుతుంది.. అధికంగా ఆల్కహాల్ తాగడం వల్ల పురుషుల్లో బెల్లీ ఫ్యాట్ కూడా ఎక్కువ అవుతుంది.

నడుము చుట్టుకొలత బొడ్డు ఫ్యాట్ ఉందో లేదో తెలుసుకోవడానికి సులభమైన మార్గం. WHO ప్రకారం స్త్రీలలో నడుము చుట్టుకొలత సమానంగా లేదా 80 సెం.మీ కంటే ఎక్కువ ఉంటే NCD (నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులు) వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పురుషులలో నడుము చుట్టుకొలత లేదా 90 సెం.మీ కంటే ఎక్కువ ఉంటే NCD (నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులు) వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

READ ALSO : Eating Ghee : నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందా? నిపుణులు ఏమంటున్నారంటే…

బొడ్డు కొవ్వును ఎలా తగ్గించాలి?

1. డెజర్ట్‌లు, స్వీట్లు, ఎరేటెడ్ పానీయాలు, స్క్వాష్‌లు, కుకీలు, క్యాండీలు, కేకులు మొదలైన చక్కెర ఉత్పత్తులను తినటం తగ్గించాలి.

2. ప్రాసెస్ చేసిన తక్షణ ఆహారాలను తీసుకోరాదు. ఆకలి వేస్తే, మఖానా, పండ్లు , పెరుగు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ని తీసుకోవాలి.

3. సాధారణ కార్బోహైడ్రేట్లను తగ్గించాలి. బ్రెడ్, బిస్కెట్లు, వైట్ రైస్, మైదా, మైదా, ఉత్పత్తులు, తెల్ల బంగాళదుంపలకు దూరంగా ఉండాలి. తృణధాన్యాలు, పీచు పదార్థాలు, చక్కెర తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినాలి.

READ ALSO : Fennel Seeds : జీర్ణ శక్తిని పెంచటంతోపాటు, కొవ్వులను కరిగించి బరువును తగ్గించే సోంపు వాటర్!

4. ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి. ఆహారంలో ఎక్కువ పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, సలాడ్లను తీసుకోవాలి. అవి సంతృప్తతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతాయి.

5. పప్పులు, టోఫు, చికెన్, తక్కువ కొవ్వు పాలు మొదలైన ఆరోగ్యకరమైన లీన్ ప్రోటీన్లను ఆహారంలో చేర్చుకోండి.

6. ఉదయం అల్పాహారం మానేయకండి. అల్పాహారంలో ప్రోటీన్లు మరియు తగినంత ఫైబర్ ఉండేలా చూసుకోండి.

READ ALSO : బ్లాక్ రైస్.. కొవ్వు కరిగిపోతుంది..!

7. ఆరోగ్యకరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ కలిగిన ఆహారాలు ఎక్కువగా తినండి. ఆవనూనె వాడండి, గింజలు, చేపలు మొదలైన వాటిని ఆహారంలో చేర్చుకోండి.

8. కనీసం రోజుకు 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. చురుకైన నడక, సైక్లింగ్, స్విమ్మింగ్, జుంబా, ఏరోబిక్స్, స్పోర్ట్స్ వంటి కార్డియో వ్యాయామం చేయండి.

9. ఉదయం ఎండలో కొంత సమయం గడపండి.

10. ఉదయాన్నేనిద్రలేవటం అన్న అలవాటును చేసుకోండి.