కరోనా : వైరస్ సోకడానికి ఒక్క తుమ్ము చాలు

  • Published By: madhu ,Published On : March 5, 2020 / 01:01 AM IST
కరోనా : వైరస్ సోకడానికి ఒక్క తుమ్ము చాలు

ఒక్క తుమ్ము మిమ్మల్ని జబ్బు పరుస్తుందని మీకు తెలుసా..? కరోనా లాంటి వైరస్‌ మీకు సోకడానికి ఒక్క తుమ్ము చాలని మీకు అవగాహన ఉందా..?  మనం తుమ్మినప్పుడు ఓ లీటర్ బాటిల్‌లో పట్టేంత పరిమాణంలో గ్యాస్‌ విడుదలవుతుంది. ఇందులో తుంపరతో పాటు, క్రిములు కూడా ఉంటాయి. ఇవి సెకనుకు 35 మీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అంటే హైవేలపై కార్లు వెళ్లేంత వేగం అన్నమాట.

ఒక్కసారి మన నోట్లో నుంచి తుంపరలు బయటకు వచ్చాక, గాల్లో కలిసి విస్తరిస్తాయి. పెద్ద తుంపరలు దాదాపు 2 మీటర్ల దూరం వెళతాయి. కానీ చిన్న తుంపర్లు మాత్రం 8 మీటర్ల దూరం వరకూ వెళతాయి. అంటే ఇన్‌ఫెక్షన్‌తో ఉన్న ఎవరైనా తుమ్మితే.. దాని ప్రభావం వారికి 8 మీటర్ల దూరంలో ఉన్నవారిపైనా పడుతుంది.  అంతేకాదు.. AC ఉన్న కార్యాలయాల్లో అయితే.. ఈ తుంపర్లు గదంతా వ్యాపించే అవకాశం ఉంటుంది.

ఇవి తమతో పాటు ప్రమాదకరమైన కరోనా వైరస్‌లాంటి వాటినీ మోసుకెళతాయి. కేవలం 10 సెకన్లలోనే ఇవి గదంతా వ్యాపిస్తాయి. అందుకే మీ చుట్టూ ఉన్నవాళ్లలో ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉంటే.. అది మీకు కూడా సోకే అవకాశాలు చాలా ఎక్కువ. టేబుల్స్‌, డోర్‌ నాబ్స్‌.. మెట్ల రెయిలింగ్‌పై 24 గంటల వరకూ ఈ వైరస్‌లు జీవించి ఉండగలవు. వాటిని మీరు ముట్టుకుని.. అదే చేతులతో ముఖాన్ని తాకితే మీకు వైరస్‌ సోకవచ్చు.

ఆఫీస్‌లో ఒక్క వ్యక్తికి వైరస్‌ సోకితే, వారం పది రోజుల్లోనే ఆఫీస్‌లో అందరికీ వైరస్ అంటుకోవచ్చు.  కాబట్టి.. తుమ్మే ముందు ఒక్కసారి ఆలోచించండి. ముఖానికి అడ్డుగా ఏదైనా పెట్టుకోండి.

Read More : అపోహ – నిజం : కరోనా వదంతులు, వాస్తవాలు