Raja Singh’s nephew: ‘‘నేను రాజాసింగ్ మేనల్లుడిని’’ అంటూ యువకుడి వీడియో.. 8 యూట్యూబ్ చానెళ్ళపై కేసు నమోదు

 ‘‘నేను ఎమ్మెల్యే రాజాసింగ్ మేనల్లుడిని. ఇప్పుడు మతం మారాను. అప్పట్లో నా పేరు శివ సింగ్.. ఇప్పుడు మొహమ్మద్ సిద్ధిఖీ’’ అంటూ ఓ యువకుడు వీడియో తీసుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్ళింది. దీంతో ఆ వీడియోను అప్ లోడ్ చేసిన యూట్యూబ్ చానెళ్ళపై పోలీసులు కేసు పెట్టి విచారణ జరుపుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Raja Singh’s nephew: ‘‘నేను రాజాసింగ్ మేనల్లుడిని’’ అంటూ యువకుడి వీడియో.. 8 యూట్యూబ్ చానెళ్ళపై కేసు నమోదు

Raja Singh's nephew

Raja Singh’s nephew: ‘‘నేను ఎమ్మెల్యే రాజాసింగ్ మేనల్లుడిని. ఇప్పుడు మతం మారాను. అప్పట్లో నా పేరు శివ సింగ్.. ఇప్పుడు మొహమ్మద్ సిద్ధిఖీ’’ అంటూ ఓ యువకుడు వీడియో తీసుకున్నాడు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్ళింది. ఆ వీడియోను అప్ లోడ్ చేసిన యూట్యూబ్ చానెళ్ళపై పోలీసులు కేసు పెట్టి విచారణ జరుపుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఇప్పటికే హెచ్చరించారు. ఆ వీడియోను పోస్ట్ చేసిన ఎనిమిది యూట్యూబ్ చానెళ్ళపై కూడా కేసులు నమోదు చేశామని అన్నారు. అది నకిలీ వీడియో అని వివరించారు. కాగా, రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. ఆయనపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ఆగస్టు 25న చెర్లపల్లి జైలుకు తరలించారు. రాజాసింగ్ పై మొత్తం 101 క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

Heavy rains in Andhra Pradesh: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో అతి భారీవర్షాలు కురిసే అవకాశం