Bus Accident In Pakistan : పెట్రోల్‌ ట్యాంకర్‌ను ఢీకొన్న బస్సు.. 20 మంది సజీవ దహనం

పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌లో ఓ బస్సు పెట్రోల్‌ ట్యాంకర్‌ను వెనుకనుంచి ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడడ్డాయి. ఆ మంటల్లో బస్సులో ఉన్న 20 మంది సజీవదహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Bus Accident In Pakistan : పెట్రోల్‌ ట్యాంకర్‌ను ఢీకొన్న బస్సు.. 20 మంది సజీవ దహనం
ad

Bus accident In Pakistan : పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం (ఆగస్టు 16,2022) తెల్లవారు ఝామున లాహోర్‌ నుంచి కరాచీ ప్రయాణీకులతో వెళ్తున్న ఓ బస్సు పెట్రోల్‌ ట్యాంకర్‌ను వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడడ్డాయి. ఆ మంటల్లో బస్సులో ఉన్న 20 మంది సజీవదహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయం చర్యల్ని చేపట్టారు. బస్సుకు మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.