United Nations: రెండు నిమిషాలకు ఒక గర్భిణి మృతి.. తగ్గిన శిశు మరణాల రేటు.. ఐరాస నివేదికలో వెల్లడి

ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు నిమిషాలకు ఒక గర్భిణి లేదా బాలింత మరణిస్తోంది. గర్భిణిగా ఉన్న సమయంలో లేదా డెలివరీ సమయంలో తలెత్తే సమస్యల వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయి.

United Nations: రెండు నిమిషాలకు ఒక గర్భిణి మృతి.. తగ్గిన శిశు మరణాల రేటు.. ఐరాస నివేదికలో వెల్లడి

United Nations: అంతర్జాతీయంగా ప్రతి రెండు నిమిషాలకు ఒక గర్భిణి లేదా బాలింత మరణిస్తున్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది. గర్భ సంబంధ సమస్యలు లేదా డెలివరీ సమయంలో తలెత్తే సమస్యల కారణంగా ఇలా మరణిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి (ఐరాస) నివేదికలో తేలింది.

Gurugram: కోవిడ్ భయంతో మూడేళ్లుగా ఇంటి నుంచి బయటకు రాని తల్లీకొడుకు.. మూడేళ్లుగా ఎలా ఉన్నారంటే

ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు నిమిషాలకు ఒక గర్భిణి లేదా బాలింత మరణిస్తోంది. గర్భిణిగా ఉన్న సమయంలో లేదా డెలివరీ సమయంలో తలెత్తే సమస్యల వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయి. 2020లో ప్రపంచవ్యాప్తంగా సగటున రెండు నిమిషాలకు ఒకరు చొప్పున.. రోజుకు 800 మంది గర్భిణులు లేదా బాలింతలు మరణించారు. అయితే, గడిచిన 20 ఏళ్లలో ప్రసూతి మరణాల రేటు మాత్రం తగ్గింది. 2000-2020 వరకు 34.3 శాతం ప్రసూతి/శిశు మరణాలు రేటు తగ్గింది.

Karnataka: ఫ్యాక్టరీల్లో రాత్రిపూట మహిళలకు పని.. వారానికి నాలుగు రోజులే డ్యూటీ.. కొత్త చట్టం తెచ్చిన కర్ణాటక

2000లో లక్ష జననాల్లో 339 మంది శిశువులు మరణిస్తే, 2020లో 223 మంది శిశువులు మాత్రమే మరణించారు. ఇందులో 2000-2015 మధ్య మరణాలు రేటు బాగా తగ్గితే, 2016-2020 వరకు మాత్రం పెద్దగా తగ్గుదల కనిపించలేదు. గత 20 ఏళ్లలో గర్భిణులు, బాలింతల మరణాల రేటు అత్యధికంగా బెలారస్‌లో తగ్గింది. అక్కడ 95.5 శాతం తగ్గుదల కనిపించింది. అయితే, వెనిజులాలో మాత్రం భారీగా పెరిగింది. అమెరికాలో కూడా 2000-2015లో మాత్రం ఈ మరణాలు రేటు పెరిగింది.

గర్భం దాల్చడం మహిళల జీవితాల్లో ఎంతో ప్రత్యేకమైంది, సంతోషకరమైంది అయినప్పటికీ.. అది లక్షలాది మంది మహిళల జీవితాల్ని కబళిస్తోందని ఐరాస, ప్రపంచ ఆరోగ్య సంస్థలు అభిప్రాయపడ్డాయి. గర్భం, ప్రసవం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక తెలియజేస్తోందని ఐరాస తెలిపింది. వైద్య సేవల్ని మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించాయి.