Flesh-Eating Maggots in Man Ear : 64 ఏళ్ల వ్యక్తి చెవిలో మాంసాన్ని తినేసే పురుగులు.. చెవిలో కొంత భాగాన్ని తినేసిన పురుగులు

64 ఏళ్ల వ్యక్తి చెవిలో మాంసాన్ని తినేసే పురుగులు ఏకంగా పుట్ట పెట్టేశాయి. ఏకంగా చెవిలో కొంత భాగాన్ని తినేసి రంథ్రం చేసేశాయి.

Flesh-Eating Maggots in Man Ear : 64 ఏళ్ల వ్యక్తి చెవిలో మాంసాన్ని తినేసే పురుగులు.. చెవిలో కొంత భాగాన్ని తినేసిన పురుగులు

Flesh-Eating Maggots in Man Ear

Flesh-eating maggots in Man ear : చెవిలో చిన్నపాటి దురద వస్తేనే భరించలేదు. చెవిలోకి చిన్న చీమ దూరినా నానా పాట్లు పడిపోతాం. కానీ ఓ వ్యక్తి చెవిలో ఏకంగా మాంసాన్ని తినేసే పురుగులు పుట్టపెట్టేశాయి. అతని చెవిలో కొంతభాగాన్ని తినేసాయి రాకాసి పురుగులు. కానీ అతనికి మాత్రం తన చెవిలో మాంసాన్ని తినేసే రాకాసి పురుగులు ఉన్నాయని తెలీయలేదు. కానీ చెవిలో దురద వచ్చి నొప్పి వస్తోంది. అదికాస్తా పెరిగి రక్తస్రావం అవ్వటంతో భాయపడి డాక్టర్ దగ్గరకెళ్లాడు. డాక్టర్లు అతని చెవి భాగాన్ని పరీక్ష చేసి తరువాత స్కానింగ్ తీసారు. స్కానింగ్ లో కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా డాక్టర్లే హడలిపోయారు. అతని చెవిలో మాంసాన్ని తినేయగల మగ్గోట్ పురుగులు ఉండటం చూసి హడలిపోయారు.

64 సంవత్సరాల పోర్చుగీసు వ్యక్తి చెవిలో దురద, రక్తస్రావం, చెవినొప్పి కారణంతో డాక్టర్ దగ్గరకు వెళ్ళగా డాక్టర్ ఆమెను పరీక్షించి స్కానింగ్ తీసాడు. ఆ స్కానింగ్ లో అతని చెవిలో మాంసాన్ని తినెయ్యగల మగ్గోట్ పురుగులు కనిపించాయి. ఆ పురుగులు అప్పటికే అతని చెవిలో కొంత ప్రాంతాన్ని తినేసి రంధ్రం చేసాయని గుర్తించారు. వాటిని చూడగానే డాక్టర్ లు భయపడ్డారు. అతని చెవిని నీటితో శుభ్రంగా కడిగి. ఆ తరువాత చెవిలో ఉన్న లార్వా దశ పురుగులను బయటకు తీసారు. అవి బ్రతికే ఉండటం వాటి కదలిక ద్వారా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒళ్లు జలదిస్తోంది ఈ పురుగుల్ని చూస్తే అంటున్నారు. ఓరినాయనో ఇన్ని పురుగులు చెవిలో కులకులమంటుంటే కూడా తెలియలేదా? అని కొంతమంది అంటుంటే..అమ్మబాబోయ్..అనుకుని చెవులు తడుముకుంటున్నారు..