German Shepherd Dog discovers Cocaine : 70 టన్నుల అరటిపండ్ల బాక్స్‌లలో.. 2700 కిలోల కొకైన్..పసిగట్టేసిన డాగ్.. డ్రగ్స్ విలువ కోట్లలో..
కోట్లాది రూపాయల కొకైన్ అరటిపండ్ల బాక్సుల్లో అక్రమ రవాణాకు సిద్ధం చేశారు. పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీలు చేశారు. జర్మన్ షెపర్డ్ సాయంతో డ్రగ్స్ గుట్టు రట్టు చేశారు ఇటాలియన్ పోలీసులు.

Italian Police seized the drug
Italian Police seized the drug : కొకైన్ అక్రమ రవాణాను డాగ్ సాయంతో ఛేదించారు ఇటాలియన్ పోలీసులు. అరటిపండ్లలో దాచిన మత్తు పదార్ధాన్ని స్వాధీనం చేసుకున్నారు. జర్మన్ షెపర్డ్ డాగ్ జస్ట్ వాసనతో డ్రగ్స్ పట్టించేసింది.
Brazil Drug Market : కూరగాయలు అమ్మినట్లు డ్రగ్స్ అమ్మేస్తున్నారు.. ఎక్కడంటే?
ఈక్వెడార్ నుండి అక్రమంగా తరలిస్తున్న 70 టన్నుల అరటిపండ్ల బాక్సులలో దాచిన మత్తు పదార్ధాన్ని ఇటాలియన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కొకైన్ విలువ 800 మిలియన్ యూరోల ($1.3 బిలియన్) కంటే ఎక్కువ విలువ చేస్తుందని వారు చెప్పారు. ఈ డ్రగ్స్ పట్టించడంలో జోయెల్ ది జర్మన్ షెపర్డ్ సాయపడింది.
జస్ట్ వాసనతో అరటిపండ్లలో దాచిన 2,700 కిలోల కొకైను పసిగట్టేసింది. కార్గో షిప్ ద్వారా జియోయా టౌరో నౌకాశ్రయానికి వచ్చిన రెండు కంటైనర్లపై పోలీసులకు అనుమానం వచ్చింది. దాంతో డ్రగ్స్ విచారణ ప్రారంభించారు. ఇంత పెద్ద మొత్తంలో పండ్లను ఎందుకు తరలిస్తున్నారని తనిఖీలు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
ముందుగా స్కానింగ్ యంత్రాలతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. చివరగా జర్మన్ షెపర్డ్ డాగ్‌ను రంగంలోకి దించారు. చివరకు దాని సాయంతో డ్రగ్స్‌ను సీజ్ చేశారు. ఈ ఘటనకు ఆరు రోజుల ముందు కూడా 6 కంటైనర్ ట్రక్కుల్లో సుమారుగా 600 కిలోల కొకైన్ పట్టుబడిందని పోలీసులు చెప్పారు. మొత్తానికి ఈ ప్రాంతంలో డ్రగ్స్ అక్రమ రవాణాపై పోలీసులు గట్టి నిఘానే వేసారనిపిస్తోంది.