Mario Draghi Resigned : ఇటలీలో రాజకీయ సంక్షోభం..ప్రధాని రాజీనామా

ఇటలీలో రాజకీయ సంక్షోభం ముదిరింది. సంకీర్ణ ప్రభుత్వంలోని ఆయా పార్టీల మద్దతును కూడగట్టడంలో విఫలమైన ప్రధాన మంత్రి మారియో డ్రాఘి... తన పదవికి రాజీనామా చేశారు. దీన్ని అంగీకరించిన దేశాధ్యక్షుడు సెర్గియో మత్తరెల్లా.. తదుపరి ఎన్నికల వరకు అపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని డ్రాఘికి సూచించారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్ష కార్యాలయం ఈ వివరాలు వెల్లడించింది.

Mario Draghi Resigned : ఇటలీలో రాజకీయ సంక్షోభం..ప్రధాని రాజీనామా

Italy

Mario Draghi resigned : ఇటలీలో రాజకీయ సంక్షోభం ముదిరింది. సంకీర్ణ ప్రభుత్వంలోని ఆయా పార్టీల మద్దతును కూడగట్టడంలో విఫలమైన ప్రధాన మంత్రి మారియో డ్రాఘి… తన పదవికి రాజీనామా చేశారు. దీన్ని అంగీకరించిన దేశాధ్యక్షుడు సెర్గియో మత్తరెల్లా.. తదుపరి ఎన్నికల వరకు అపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని డ్రాఘికి సూచించారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్ష కార్యాలయం ఈ వివరాలు వెల్లడించింది. ఈ క్రమంలోనే అధ్యక్షుడు.. పార్లమెంటును రద్దు చేసి, సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ముందస్తు ఎన్నికలకు పిలిచే అవకాశం ఉందని స్థానిక రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇటలీలో మారియో డ్రాఘి నేతృత్వంలోని జాతీయ ఐక్య ప్రభుత్వంలో.. ఫైవ్ స్టార్ మూవ్‌మెంట్, ఫోర్జా ఇటాలియా, యాంటీ ఇమ్మిగ్రాంట్‌ లీగ్‌, డెమోక్రటిక్‌ పార్టీ, ఆర్టికల్‌ వన్ తదితర పార్టీల భాగస్వామ్యం ఉంది. అయితే.. ఇంధన, ఆర్థిక సంక్షోభంపై ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ, యుక్రెయిన్‌కు తోడ్పాటు విషయంలో ఇటీవల ఈ పార్టీలకు, ప్రభుత్వానికి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే గత వారం ఫైవ్ స్టార్ మూవ్‌మెంట్ పార్టీ నేత, ఇటలీ మాజీ ప్రధాన మంత్రి గియుసెప్ కాంటే.. ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకున్నారు.

Italy : ఇటలీలో 70 ఏళ్ల‌లో లేనంత నీటి కొరత..ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

అప్పుడే డ్రాఘి తన రాజీనామా ప్రకటించినా.. దేశాధ్యక్షుడు మత్తరెల్లా దాన్ని తిరస్కరించారు. సెనెట్‌లో బుధవారం విశ్వాస పరీక్ష నిర్వహించారు. ఫోర్జా ఇటాలియా, లీగ్‌లు సైతం ఫైవ్ స్టార్ మూవ్‌మెంట్‌తో కలిసి ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. దీంతో మెజారిటీ దక్కక.. ప్రధాని డ్రాఘి రెండోసారి రాజీనామా చేశారు. అధ్యక్షుడు సైతం ఆయన రాజీనామాను ఆమోదించారు. ఎన్నికల వరకు ప్రభుత్వాన్ని నడిపించాల్సిందిగా సూచించారు.