Russia – Ukraine war: అందుకే పుతిన్ వెనకబడ్డాడా?: యుద్ధానికి వెళ్లమంటూ మొండికేసిన రష్యా బలగాలు

రష్యన్ వార్తాపత్రిక ప్స్కోవ్స్కాయా గుబెర్నియా ప్రకారం, రష్యాలోని ప్స్కోవ్ ప్రావిన్స్లో ఒక యూనిట్ నుండి 60 మంది రష్యన్ పారాట్రూపర్లు యుక్రెయిన్లో పోరాడటానికి నిరాకరించారు.

Russia – Ukraine war: అందుకే పుతిన్ వెనకబడ్డాడా?: యుద్ధానికి వెళ్లమంటూ మొండికేసిన రష్యా బలగాలు

Russia

Russia – Ukraine war: యుక్రెయిన్ రష్యా యుద్ధం పాక్షికంగా ముగిసింది. యుక్రెయిన్ నుంచి రష్యా సేనలు కాస్త వెనక్కు తగ్గాయి. మరియొపాల్, డాన్ బాస్ ప్రాంతాలు మినహా..యుక్రెయిన్ లోని ప్రధాన నగరాల నుంచి రష్యా సేనలు కాస్త వెనక్కు తగ్గాయి. దాదాపు 42 రోజుల పాటు ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన పోరులో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే యుద్ధం ఆరంభంలో రష్యా సేనలు ప్రదర్శించిన పోరాటపటిమ..చివర వరకు కొనసాగించలేకపోయాయి. ఊహించని విధంగా యుక్రెయిన్ సైన్యం రష్యా సేనలపై తిరగబడడమే ఇందుకు కారణం. యుక్రెయిన్ నగరాలపై భారీ బాంబులతో విరుచుకుపడిన రష్యా సేనలు..ఆయా నగరాలను నేలమట్టం చేసాయి. అయితే యుక్రెయిన్ సైనికులను ఎదుర్కోవడంలో మాత్రం రష్యా సైనికులు విఫలమైయ్యారు. యుక్రెయిన్ నుంచి ఎదురైనా తీవ్ర ప్రతిఘటనతో రష్యా సేనలు తోకముడిచాయంటూ..యూరోప్ పత్రికలు వ్యంగ్య కథనాలూ ప్రచురించాయి. దీంతో యుక్రెయిన్ ను ఆక్రమించుకోవాలన్న పుతిన్ ఆలోచనకు బ్రేక్ పడి..భంగపాటుకు గురైన పుతిన్..తన అనుచరులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా కథనాలు వెలువడ్డాయి. అదే సమయంలో యుక్రెయిన్ లో ఉన్న రష్యా సైనికులు సైతం ఆకలితో అలమటిస్తూ..యుద్ధం చేయలేమంటూ చేతులెత్తాశారు.

Also read:Pak politics : ఇమ్రాన్ ఖాన్ ఔట్.. అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన విపక్షాలు.. అర్థరాత్రి వరకు కొనసాగిన రాజకీయ హైడ్రామా

దీంతో చేసేదేమిలేక బలగాలను వెనక్కు పిలిపించాడు పుతిన్. ఇదిలాఉంటే..తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. యుక్రెయిన్ ను ఆక్రమించుకునేందుకు రష్యా బలగాలు పోరాడుతుంటే..వారికి తోడుగా పోరాడేందుకు పారా మిలిటరీ బలగాలను, ఇతర సాయుధ దళాలను మోహరించాలని రష్యా అధికారులు ఆదేశించారు. అయితే అప్పటికే యుక్రెయిన్ లో జరుగుతున్న విధ్వంసాన్ని చూస్తున్న రష్యన్ పారాట్రూపర్స్..తాము యుద్ధానికి వెళ్లబోమంటూ తెగేసి చెప్పారంట. దీంతో అదనపు బలగాలు లేకపోతే యుద్ధాన్ని కొనసాగించలేమని భావించిన రష్యా..తగిన నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేసింది. ఈ జాప్య ఫలితం..పదుల సంఖ్యలో రష్యా సైనికులను యుక్రెయిన్ సైన్యం మట్టుపెట్టింది. రష్యన్ వార్తాపత్రిక ప్స్కోవ్స్కాయా గుబెర్నియా ప్రకారం, రష్యాలోని ప్స్కోవ్ ప్రావిన్స్లో ఒక యూనిట్ నుండి 60 మంది రష్యన్ పారాట్రూపర్లు యుక్రెయిన్లో పోరాడటానికి నిరాకరించారు. దీంతో ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు ఆయా బలగాలపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రష్యా అధికారులు బెదిరించారు. రష్యా వైమానిక దళమైన వి.డి.వి. యుక్రెయిన్ లో భారీ నష్టాలను చవిచూసింది. వీ డి విలోని ప్రఖ్యాత 331వ గార్డ్స్ పారాచూట్ రెజిమెంట్ కు చెండియాన్ కమాండర్ కల్నల్ సెర్గీ సుఖరేవ్ సహా మరో 39 మంది ట్రూపర్స్ ను యుక్రెయిన్ సైన్యం కాల్చి చంపింది.

Also read:AP New Cabinet : కొత్త మంత్రివర్గం లిస్టు సిద్ధం.. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు

యుక్రెయిన్ వెళ్లేందుకు నిరాకరించిన వారిలో పారాట్రూపర్లే కాదు..ఖకాసియా ప్రాంతంలోని రష్యాకు చెందిన రోస్గ్వార్డియా నేషనల్ గార్డ్కు చెందిన కనీసం 11 మంది సభ్యులు కూడా ఇదే విధంగా నిరాకరించారు. కెప్టెన్ ఫరీద్ చితావ్, రోస్గ్వార్డియాలోని 11 మంది అధికారులు యుక్రెయిన్ను ముట్టడించడానికి నిరాకరించారు. యుద్ధ సమయంలో పట్టుబడిన కొందరు రష్యన్ సైనికులు తెలిపిన వివరాలు మేరకు..యుక్రెయిన్ పై పోరాటం గురించి తమ నాయకులు తమకు అబద్ధం చెప్పారని, యుక్రెయిన్ సైన్యం నుంచి ఎదురైన తీవ్రమైన ప్రతిఘటనకు తాము సిద్ధం కాలేకపోయామని చెప్పారు. ఇక్కడే రష్యా సైన్యం బలహీనత అర్ధం అయింది. నిజం చెప్పాలంటే యుక్రెయిన్ పై దండయాత్ర ప్రారంభించినప్పటి నుండి రష్యన్ దళాలు భారీ నష్టాలను చవిచూశాయి.యుక్రెయిన్ లో జరిగిన దాడిలో 7,000 నుంచి 15,000 మంది రష్యన్ సైనికులు మరణించారని నాటో గత నెలలో అంచనా వేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వద్ద పనిచేసే సలహాదారులు “అతనికి నిజం చెప్పడానికి భయపడ్డారని..దీంతో యుక్రెయిన్ ఆక్రమణపై పరిస్థితిని పుతిన్ “భారీగా తప్పుగా అంచనా వేశారు” అని యూకే ఇంటెలిజెన్స్ చీఫ్ జెరెమీ ఫ్లెమింగ్ అన్నారు.