Ukraine vs Russia War : యుక్రెయిన్‌కు షాకిచ్చిన అమెరికా.. ఆ హామీని నెరవేర్చలేమన్న అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్

రష్యాపై యుద్ధంలో అన్నివిధాలుగా అండగా నిలుస్తామని యుక్రెయిన్ అధ్యక్షుడికి ఇచ్చిన హామీని అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ తాజాగా విస్మరించారు. యుక్రెయిన్‌కు పైటర్ జెట్ విమానాలను పంపించేందుకు అనుకూలంగా ఉన్నారా అని మీడియా ప్రశ్నించగా.. అలాంటిది ఏమీ లేదని జో బిడెన్ తేల్చి చెప్పారు.

Ukraine vs Russia War : యుక్రెయిన్‌కు షాకిచ్చిన అమెరికా.. ఆ హామీని నెరవేర్చలేమన్న అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్

america president

Ukraine vs Russia War : యుక్రెయిన్ వర్సెస్ రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. గత ఏడాది ఫిబ్రవరి 24న మొదలైన ఇరు దేశాల మధ్య యుద్ధంతో యుక్రెయిన్ ప్రజలు భయంగుప్పిట్లో బతుకుతున్నారు. రష్యా సైన్యం క్షిపణుల దాడులను కొనసాగిస్తుండటంతో వందలాది ప్రాంతాలు ధ్వంసం అవుతున్నాయి. వేలాది మంది యుక్రెయిన్ ప్రజలు, సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియాతోపాటు అనేక దేశాలు యుక్రెయిన్‌కు మద్దతుగా నిలిచాయి. రష్యా దాడులను తిప్పికొట్టేందుకు రక్షణ సహాయాన్ని అందిస్తున్నాయి. ఇటీవలి కాలంలో కాలంలో అమెరికా గన్స్, ట్యాంకుల రూపంలో యుక్రెయిన్ కు సైనిక సహాయాన్ని పెంచింది.

Russia vs Ukraine War: యుక్రెయిన్‌కు బ్రాడ్లీ యుద్ధ వాహనాలు.. భారీగా రక్షణ ప్యాకేజీని ప్రకటించిన అమెరికా..

యుక్రెయిన్ పాశ్చాత్య దేశాల నుంచి నిరంతరం సైనిక సహాయం పొందుతోంది. రష్యా దళాలను తిప్పికొట్టేందుకు ఇప్పటికే యుక్రెయిన్ మద్దతు కలిగిన దేశాల నుంచి 300 కంటే ఎక్కువ ట్యాంకులను పొందింది. అమెరికా ఇటీవల యుక్రెయిన్ కు అబ్రమ్స్ ట్యాంకులను పంపాలని నిర్ణయించింది. గత వారం, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ యుక్రెయిన్ కు 31 ఎంఐ అబ్రమ్స్ ట్యాంకులను పంపనున్నట్లు ప్రకటించారు. దీనితోపాటు జర్మనీసైతం విలువైన ఆయుధ సామాగ్రిని అందించేందుకు అంగీకరించింది.

Russia vs Ukraine War: యుక్రెయిన్‌పై ప‌ట్టుకోసం.. క‌మాండ‌ర్‌ను మార్చిన ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌..

రష్యా సైన్యం దాడులను తిప్పికొట్టేందుకు యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలన్ స్కీ ఎఫ్ -16 ఫైటర్ జెట్ లను పంపించాలని అమెరికాను డిమాండ్ చేశారు. రష్యాపై యుద్ధంలో అన్నివిధాలుగా అండగా నిలుస్తామని యుక్రెయిన్ అధ్యక్షుడికి ఇచ్చిన మాటను జో బిడెన్ తాజాగా విస్మరించారు. యుక్రెయిన్ కు జెట్ విమానాలను పంపించేందుకు అనుకూలంగా ఉన్నారా అని మీడియా ప్రశ్నించగా.. అలాంటిది ఏమీ లేదని జో బిడెన్ తేల్చి చెప్పారు.