UP Election : ఎస్పీ-ఆప్ మధ్య కుదిరిన పొత్తు!

మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో సంచలన రీతిలో కొత్త పొత్తులకు తెరలేచింది. యూపీ ఎన్నికల కోసం అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ(SP)తో

UP Election : ఎస్పీ-ఆప్ మధ్య కుదిరిన పొత్తు!

Aap Sp

UP Election మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో సంచలన రీతిలో కొత్త పొత్తులకు తెరలేచింది. యూపీ ఎన్నికల కోసం అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ(SP)తో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)తొలిసారి జతకట్టనున్నాయి. ఎన్నికల్లో సీట్ల పంపకాల విషయమై సమాజ్‌వాదీ పార్టీ-ఆప్ మధ్య చర్చలు కూడా ప్రారంభమయ్యాయి.

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ,ఉత్తరప్రదేశ్ లో ఆప్ ఇంచార్జ్ గా ఉన్న సంజయ్ సింగ్ బుధవారం లక్నోలో అఖిలేష్ యాదవ్ తో భేటీ అయ్యారు. అఖిలేష్ తో భేటీ తర్వాత సంజయ్ సింగ్ మాట్లాడుతూ..అఖిలేశ్ యాదవ్ తో భేటీ సంతృప్తికరంగా సాగిందని, పొత్తుకు రెండు పార్టీ నుంచి అంగీకారం కుదరిందని, ఎన్నికల పోరాటానికి అజెండా నిర్ధారణతోపాటు సీట్ల పంపకాలపైనా ఇవాళ చర్చలు జరిపామని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు.

“ఈరోజు చర్చలు ప్రారంభించాం. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దుష్టపాలనలో అష్టకష్టాలు పడుతున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని ఓడించడమే మా ముందున్న లక్ష్యం. అఖిలేష్ యాదవ్ అనేక పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. ఈ రోజు మా సమావేశం కూడా ఆ దిశలో ఒక అడుగు. బీజేపీని ఓడించమే విపక్ష పార్టీ ప్రధాన లక్ష్యంగా ఉంటుంది” అని సంజయ్ సింగ్ అన్నారు.  కాగా,ఈ ఏడాది జులైలో కూడా అఖిలేష్ తో సంజయ్ సింగ్ భేటీ అయిన విషయం తెలిసిందే.

సమాజ్ వాదీ పార్టీతో పొత్తులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ.. పశ్చిమ యూపీ నుంచే సీట్లు ఆశిస్తున్నట్లు సమాచారం. యూపీలో ఓటర్లుగా ఉంటూ, ఢిల్లీలో వసల జీవనం సాగిస్తోన్న లక్షల మంది ఆప్ పథకాల ద్వారా లబ్ది పొందుతోన్న నేపథ్యంలో ఆ ఓట్లు ప్రభావం చూపుతాయని రెండు పార్టీలూ భావిస్తున్నాయి

కాగా, ఇప్పటికే ఎస్పీ.. జయంత్ సింగ్ నాయకత్వంలో ఆర్ఎల్డీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లో జాట్ వర్గానికి చెందిన రైతుల్లో ఆర్ఎల్డీకి బలమైన పట్టు ఉండటం, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో జాట్ రైతులే ముందు వరసలో ఉండటం, ఇప్పుడు వారంతా బీజేపీ వ్యతిరేక కూటమి అయిన ఎస్పీతో కలవడం కీలకంగా మారింది. వీరికి తాజాగా ఆప్ కూడా తోడు కావడంతో ఫలితాలు ఎలా ఉంటాయనేది ఉత్కంఠరేపుతోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఇదే తొలి పోటీ. ఆప్ పార్టీ ఇటీవల యూపీలో వరుస “తిరంగ యాత్రలను”నిర్వహించింది. అత్యంత ప్రముఖమైన ఆలయ పట్టణం అయోధ్యలో కూడా తిరంగ యాత్ర నిర్వహించింది ఆప్.

ALSO READ Rajasthan : రోడ్లు కత్రినా బుగ్గల్లా ఉండాలి, నెటిజన్ల ఫైర్..వీడియో వైరల్