Balakrishna: మరో క్రేజీ కాంబినేషన్.. బాలయ్యతో ‘సర్కారు’ దర్శకుడు?

అఖండ భారీ సక్సెస్ తో ఊపు మీదున్న నటసింహం బాలయ్య ఇప్పుడు వరసపెట్టి సినిమాలు చేసేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటికే గోపీచంద్ మలినేనితో సినిమా మొదలు పెట్టిన బాలయ్య.. సూపర్ ఫాస్ట్ లో..

Balakrishna: మరో క్రేజీ కాంబినేషన్.. బాలయ్యతో ‘సర్కారు’ దర్శకుడు?

Balakrishna

Balakrishna: అఖండ భారీ సక్సెస్ తో ఊపు మీదున్న నటసింహం బాలయ్య ఇప్పుడు వరసపెట్టి సినిమాలు చేసేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటికే గోపీచంద్ మలినేనితో సినిమా మొదలు పెట్టిన బాలయ్య.. సూపర్ ఫాస్ట్ లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇది పూర్తి కాకుండానే దర్శకుడు అనిల్ రావిపూడితో సినిమా మొదలు కానుంది. ఎఫ్3 విడుదల కాగానే అనిల్ ఈ సినిమా కసరత్తులు మొదలు పెట్టనున్నాడు. అనిల్-బాలయ్య కాంబినేషన్ పై ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి.

Balakrishna: క్రేజీ టాక్.. సంపత్ నందితో బాలయ్య సినిమా?

ఇవి రెండు సినిమాలు కాకుండానే మరో ముగ్గురు దర్శకులు కూడా బాలయ్య కోసం కథలు సిద్ధం చేసుకొని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సంపత్ నంది బాలయ్యతో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతుండగా.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కిస్తున్న పరుశురామ్ కూడా బాలయ్యతో సినిమాకి ప్రయత్నిస్తున్నాడట. గతంలోనే పరుశురామ్ ఓ స్టోరీ లైన్ చెప్పగా బాలయ్య పాజిటివ్ గా స్పందించారట. ఇప్పుడు అదే లైన్ తో కథ సిద్ధం చేస్తున్నారట.

Balakrishna: అన్‌స్టాపబుల్ మూవీ లైనప్.. జోరు మీదున్న బాలయ్య!

మహేష్ సర్కారు వారి పాట సినిమా అయ్యాక ఈ సినిమా చర్చలు మొదలు కానున్నాయి. అనిల్ రావిపూడి సినిమాతోనే ఈ సినిమా కూడా పట్టాలెక్కే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఈ సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ కూడా ఉండగా ఈ పాత్రలో ఎవరైనా యంగ్ హీరో కనిపించనున్నాడని తెలుస్తోంది. పరుశురామ్ తో బాలయ్య సినిమా అనగానే నందమూరి ఫ్యాన్స్ లో ఉత్సాహం మొదలైంది. అయితే.. ఈ సినిమా పట్టాలెక్కేందుకు సమయం పట్టనుంది.