Bandi Sanjay: పొంగులేటి ఇంటికి ఈటల రాజేందర్ వెళ్లే విషయం నాకు తెలియదు.. కాంగ్రెస్ ఆ ఒక్క ప్రకటనతో బీజేపీ గెలుపు ఖాయమైంది!

సీఎం కేసీఆర్ కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కొరకు నిధులు పంపుతున్నారనేది పచ్చి నిజం అని బండి సంజయ్ అన్నారు.

Bandi Sanjay: పొంగులేటి ఇంటికి ఈటల రాజేందర్ వెళ్లే విషయం నాకు తెలియదు.. కాంగ్రెస్ ఆ ఒక్క ప్రకటనతో బీజేపీ గెలుపు ఖాయమైంది!

Etela Rajender and Bandi Sanjay Kumar

Bandi Sanjay: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించేందుకు ఆయన ఇంటికి గురువారం బీజేపీ చేరికల కమిటీ వెళ్లింది. ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో చేరికల కమిటీ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రఘునందనరావుతోపాటు మరికొందరు బీజేపీ నేతలు పొంగులేటి నివాసానికి వెళ్లారు. అయితే, ఆ అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి దగ్గరికి ఈటల రాజేందర్ వెళ్లారన్న సమాచారం నాకు తెలియదని అన్నారు. నా దగ్గర ఫోన్ లేదు. అందుకే నాకు ఇప్పటిదాకా సమాచారం లేదన్నారు. కానీ నాకు చెప్పకపోవడం తప్పేం కాదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

Ponguleti Srinivas Reddy: బీజేపీలోకి ఖాయమా? పొంగులేటి ఇంటికి బీజేపీ చేరికల కమిటీ.. పసందైన విందు ..

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరుతానంటే తప్పకుండా ఆహ్వానిస్తాం. తెలంగాణ‌లో రాక్షస రాజ్యం‌పై పోరాడేందుకు ఎవరినైనా కలుపుకుపోతామని బండి సంజయ్ అన్నారు. బీజేపీలో ఎవరి పనివాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. నాకు తెలిసినవారితో నేను మాట్లాడతా, ఈటలకు తెలిసినవారితో ఆయన మాట్లాడతారు. ఇందులో తప్పేంలేదంటూ సంజయ్ అన్నారు. కరీంనగర్‌లోని చైతన్యపురిలో పలు అభివృద్ధి పనులను బండిసంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Bandi Sanjay: కేసీఆర్‌ నీకు ఢిల్లీలో ఏం పని..? ఏం కొంప మునుగుతుందని పోయావ్ ..

కర్ణాటకకు కేసీఆర్ నిధులు
సీఎం కేసీఆర్ కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కొరకు నిధులు పంపుతున్నారనేది పచ్చి నిజం అని సంజయ్ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకివస్తే బజరంగ్ దళ్ నిషేధిస్తే హిందువుల పరిస్థితి ఏంటి అని సంజయ్ ప్రశ్నించారు. బజరంగ్‍‌దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ చెప్పడం బీజేపీ గెలుపు ఖాయం అయిపోయిందని బండి సంజయ్ జోస్యం చెప్పారు. కర్ణాటక‌లో బజరంగ్‌దళ్‌ను నిషేదిస్తానని కాంగ్రెస్ ప్రకటించడంతో కర్ణాటక ప్రజలు ఒకటై బీజేపీని గెలిపిస్తారని సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

karnataka election 2023 : ప్రధాని మోదీ చుట్టూ కన్నడ రాజకీయాలు .. మోదీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంగా మారిన ఎన్నికలు

తెలంగాణలో ప్రజావ్యతిరేక పాలన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా‌వ్యతిరేక పాలన సాగిస్తోందని అన్నారు. మిడ్ మానేరు నిర్వాసితులకు ఇంతవరకు నష్టపరిహారం లేదని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి 500 కోట్లు ఇస్తామని హామీ ఇంతవరకు అతీగతి లేదని అన్నారు. రైతుల ధాన్యాన్ని ముందే కొనుగోలు‌చేస్తే ఇంత నష్టం జరిగేది కాదు అని, రైతులకు నష్టపరిహారం 10,000 అందిస్తానని చెప్పి నెల గడుస్తున్నా ఇంతవరకు సీఎం కేసీఆర్ పరిహారం ఊసే లేదని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇన్ని హామీలు ఇచ్చిన కేసీఆర్.. రాష్ట్రాన్ని వదిలి ఢిల్లీకి పోయి రాజకీయాలు చేస్తున్నాడని సంజయ్ విమర్శించారు.