Maharashtra political crisis: వీడని ఉత్కంఠ.. దూకుడు పెంచిన బీజేపీ.. అడ్డుకొనేందుకు ఉద్ధవ్ ప్రయత్నాలు

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అధికారాన్ని నిలబెట్టుకొనేందుకు సంకీర్ణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే, తిరిగి అధికారంలోకి వచ్చేలా బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లుకనిపిస్తోంది. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన రెబల్ ఎమ్మెల్యే వర్గం ఇంకా తమ తదుపరి కార్యాచరణను ప్రకటించాల్సి ఉంది.

Maharashtra political crisis: వీడని ఉత్కంఠ.. దూకుడు పెంచిన బీజేపీ.. అడ్డుకొనేందుకు ఉద్ధవ్ ప్రయత్నాలు

Maharasta

Maharashtra political crisis: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అధికారాన్ని నిలబెట్టుకొనేందుకు సంకీర్ణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే, తిరిగి అధికారంలోకి వచ్చేలా బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లుకనిపిస్తోంది. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన రెబల్ ఎమ్మెల్యే వర్గం ఇంకా తమ తదుపరి కార్యాచరణను ప్రకటించాల్సి ఉంది. ఇదిలా ఉంటే మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం రెబల్ ఎమ్మెల్యేల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా షిండేను తీవ్రస్థాయిలో విమర్శించారు. కార్యకర్తలే శివసేన సంపద అని, వారు తనతో ఉన్నంత వరకూ తాను ఎలాంటి విమర్శలను పట్టించుకోనని ఉద్దవ్ అన్నారు. సొంత మనుషులే శివసేనకు ద్రోహం తలపెడుతున్నారని వ్యాఖ్యానించారు.

Health Benefits: రోజుకు 100గ్రాముల పచ్చి ఉల్లిపాయ తింటే ఆరోగ్యం పదిలం.. గుండెపోటు దరిచేరదట..

మరోవైపు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు పై బీజేపీ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు బిజెపి మిత్ర పక్షాలతో మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సమావేశం కానున్నారు. రామ్ దాస్ అత్వాలే సహా మిత్రపక్ష నేతలతో ఫడ్నవిస్ సమావేశమవుతారు. మరోవైపు ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఉద్ధవ్ ఠాక్రే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అయ్యారు. శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు శివసేన జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసిన ఉద్ధవ్ ఠాక్రే.. తదుపరి కార్యాచరణతో పార్టీ నేతలతో చర్చించనున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం 6:30కి మెరైన్ లైన్స్ లో ఆదిత్య ఠాక్రే బహిరంగ సభ జరగనుంది. ఈ బహిరంగ సభ ద్వారా శివసేన క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.

Viral video: తన్నుకున్న టీచర్లు.. విద్యార్థులు ఏం చేశారంటే..! వీడియో వైరల్

మరోవైపు 16మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శివసేన పార్టీ డిప్యూటీ స్పీకర్‌ను కోరింది. చీఫ్ విప్ ఆదేశాలను వారి ఉల్లంఘించారని పేర్కొంటూ ఈ విజ్ఞప్తి చేసింది. ఈ 16 మంది ఎమ్మెల్యేల్లో ఏక్‌నాథ్ షిండే కూడా ఉన్నారు. అయితే 16మంది రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకొనే విషయంలో డిప్యూటి స్పీకర్ న్యాయ సలహా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ తమపై చర్యలు తీసుకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఇప్పటికే షిండే వర్గం ఎమ్మెల్యే తెలిపారు. 2/3 మెజారిటీ ఉన్నందున తమకు అనర్హత వేటు వర్తించదని షిండే వర్గం పేర్కొంటుంది. ప్రస్తుతం షిండే క్యాంప్ లో 38 మంది శివసేన ఎమ్మెల్యేలు,9మంది స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. షిండే వర్గం బీజేపీకి మద్దతు ఇస్తే బీజేపీ అధికారంలోకి రావటం ఖాయంగా కనిపిస్తొంది.

Dating App: డేటింగ్ యాప్‌లో యువతి పరిచయం.. బ్యాంక్ మేనేజర్ నుంచి రూ.5.81 కోట్లు స్వాహా

మరోవైపు మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య.. తిరుగుబాటుదారుడైన శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే శనివారం తన ట్విటర్ ఖాతాలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శివసేన పార్టీపై మరోసారి విమర్శలు గుప్పించారు. శివసేన ఎమ్మెల్యేల రక్షణను ముఖ్యమంత్రి, హోంమంత్రి ఆదేశాల మేరకు ఉపసంహరించబడిందని అన్నారు. వారిని, వారి కుటుంబాలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని షిండే అన్నారు.