Pawar vs Pawar: మరింత ముదురుతోన్న ఎన్సీపీ సంక్షోభం.. తప్పు జరిగిందన్న శరద్ పవార్‌పై సెటైర్లు గుప్పించిన మాజీ రైట్ హ్యాండ్
యోలాలో ప్రజలు సంతోషంగా ఉన్నందున ఆయన క్షమాపణ చెప్పకూడదు. వారు నన్ను నాలుగుసార్లు ఎన్నుకున్నారు. ఆయన ఇలా క్షమాపణ చెబితే, రాష్ట్రంలోని చాలా మంది వద్దకు వెళ్లవలసి ఉంటుంది.

NCP vs NCP: శనివారం నాసిక్ జిల్లాలోని యోలా నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్.. మహారాష్ట్ర పర్యటన ప్రారంభించారు. ఇది ఎన్సీపీ తిరుగుబాటు నేత ఛగన్ భుజ్‌బల్ నియోజకవర్గం. అయితే భుజ్‌బల్‌ను ఉద్దేశించే పవార్ స్పందిస్తూ తనను నమ్మి భుజ్‌బల్‌కు ఓట్లేసి గెలిపించినందుకు క్షమాపణలు చెబుతున్నానని, ఇంకోసారి అలాంటి తప్పు జరగదని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
అయితే పవార్ చేసిన ఈ వ్యాఖ్యలపై భుజ్‌బల్ సెటైర్లు గుప్పించారు. ప్రజలు తనను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. పవార్ ఇలా క్షమాపణలు చెప్తూ పోతే.. ఆయన రాష్ట్రమంతా తిరిగి అదే విధంగా విచారం వ్యక్తం చేయాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. శనివారం నిర్వహించిన ర్యాలీలో పవార్ మాట్లాడుతూ “మీ అందరికీ (యోలాలోని ప్రజలకు) క్షమాపణ చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. నా నిర్ణయం తప్పు. మీరు నన్ను నమ్మి నా పార్టీకి ఓటు వేశారు. కానీ నా నిర్ణయం (యోలా నుండి ఛగన్ భుజబల్ ఎమ్మెల్యేగా ఉండటం) తప్పని తేలిపోయింది” అని పవార్ అన్నారు.
Sunil Gavaskar : రోహిత్ కెప్టెన్సీ నిరాశపరిచింది.. ఆటగాళ్ల మధ్య గ్యాప్ పెరగడానికి అది ఓ కారణం
ఇక సోమవారం మీడియా సమావేశంలో భుజ్‌బల్ మాట్లాడుతూ “ఇక్కడ (యోలాలో) ప్రజలు సంతోషంగా ఉన్నందున ఆయన (శరద్ పవార్) క్షమాపణ చెప్పకూడదు. వారు నన్ను నాలుగుసార్లు ఎన్నుకున్నారు. ఆయన ఇలా క్షమాపణ చెబితే, రాష్ట్రంలోని చాలా మంది వద్దకు వెళ్లవలసి ఉంటుంది. అంతటా వెళ్లి అదేవిధంగా విచారం వ్యక్తం చేయండి” అని అన్నారు. ఇక అదే విధంగా తిరుగుబాటు పవార్ సొంత కుటుంబం నుంచే వచ్చిందని, తన వల్ల కాదని, ఇది శరద్ పవార్ గుర్తించాలని ఛగన్ అన్నారు.
Twitter: పాకిస్తాన్ నుంచి ట్వీట్ చేస్తే, జమ్మూ కశ్మీర్ అని చూపిస్తోందట.. వివాదాస్పదంగా ట్విటర్ తీరు
వాస్తవానికి శరద్ పవార్‌కు భుజ్‌బల్ ప్రధాన అనురచరుడిగా మెదిలారు. అయితే అజిత్ పవార్‌తో చేతులు కలిపి బీజేపీ-శివసేన నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చేరిన ఎనిమిది ఎన్సీపీ నేతల్లో ఆయన ఒకరు. షిండే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయగా, మిగిలిన ఎనిమిది మంది మంత్రులు అయ్యారు.