CM KCR : త్వరలో కొత్త జాతీయ పార్టీ..!-కేసీఆర్ సంచలనం

కొత్త పార్టీ ఎందుకు పెట్టకూడదు? పెడితే తప్పా? అని ప్రశ్నించారు. దేశంలో కొత్త పార్టీ పెట్టే దమ్ము నాకు లేదా? అని నిలదీశారు. జాతీయ పార్టీ పెడితే నన్ను ఎవరు అడ్డుకుంటారు?

CM KCR : త్వరలో కొత్త జాతీయ పార్టీ..!-కేసీఆర్ సంచలనం

Cm Kcr National Party

CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ తగ్గేదేలే అంటున్నారు. ప్రధాని మోదీతో సమరానికి సై అంటున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని టార్గెట్ చేసిన కేసీఆర్.. మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. హైదరాబాద్ ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. బీజేపీ మస్ట్ గో ఫ్రమ్ దిస్ కంట్రీ (బీజేపీ ఈ దేశం నుంచి వెళ్లిపోవాలంతే) అంటూ నినదించారు. ఇలాంటి వాళ్లు అధికారంలో ఉండడానికి వీల్లేదని అన్నారు. ఇప్పటికే బీజేపీ చేసిన పాపాలు ఎక్కువైపోయాయని, మోదీకి ఇచ్చిన సమయంలో 80 శాతం అయిపోయిందని కేసీఆర్ అన్నారు.

అంతేకాదు.. కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ప్రజలంతా అవసరమని కోరుకుంటే దేశంలో కొత్త జాతీయ పార్టీ పెడతామని ప్రకటించారు. జాతీయ పార్టీ పెడతారా అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు కేసీఆర్ ఇలా సమాధానమిచ్చారు. కొత్త పార్టీ ఎందుకు పెట్టకూడదు? పెడితే తప్పా? అని ప్రశ్నించారు. దేశంలో కొత్త పార్టీ పెట్టే దమ్ము నాకు లేదా? అని నిలదీశారు. జాతీయ పార్టీ పెడితే నన్ను ఎవరు అడ్డుకుంటారు? ప్రజాస్వామ్యంలో ప్రజలు అనుకుంటే ఏమైనా జరగవచ్చు అని కేసీఆర్ అన్నారు.

కళ్లకు మేలు చేసే ఆహారాలు ఇవే..!

నేను పుట్టగానే సీఎంను అవుతానని నా తల్లిదండ్రులు కలగన్నారా? ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తుంటే.. అవకాశాలు అవే వస్తాయని కేసీఆర్ తెలిపారు. తాను తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీని ఏర్పాటు చేసిన‌ప్పుడు కూడా అంద‌రూ న‌వ్వార‌ని కేసీఆర్ గుర్తుచేశారు. అప్పుడు న‌వ్విన వారు.. ఇప్పుడు ఏం చేస్తున్నార‌ని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామ‌ని.. ఉద్యమం చేస్తామ‌ని తాను ప్రక‌టించిన నాడు కూడా అంద‌రూ న‌వ్వార‌న్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి చూపించామ‌న్నారు. ఇప్పుడు తాను జాతీయ పార్టీ పెట్టినా ఎవ‌రూ అడ్డుకోర‌ని కేసీఆర్ తేల్చి చెప్పారు.

”కేసీఆర్ నీటిబొట్టు.. అంతకాదు అన్న‌ారు‌.. మ‌రి నీటిబొట్టు లాంటి కేసీఆర్ ను చూసి ఎందుకు భ‌య‌ప‌డుతున్నారు. ఇప్పుడు కూడా ఏం జ‌రుగుతుందో ఎవ‌రికి తెలుసు. నేను రైల్వే స్టేష‌న్‌లో చాయ్ అమ్ముకున్నా అని మోదీనే చెప్పారు క‌దా. ఆయ‌న ప్ర‌ధాన మంత్రి కాలేదా? సినిమా న‌టులు ముఖ్య‌మంత్రులు కాలేదా. ఎంజీఆర్, ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రులు అయ్యారు. ఏం జ‌రుగుతుందో నాకు తెలియ‌దు. కానీ, ఏదో ఒక‌టి మాత్రం జ‌రుగుతుంది” అని సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు.

WhatsApp Web : వాట్సాప్ వెబ్‌లోనూ ఇక వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.. కమింగ్ సూన్..!

కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ ప‌నితీరును మ‌రోసారి ఎండ‌గ‌ట్టారు కేసీఆర్. ”మోదీ ప్ర‌భుత్వానికి ద‌మ్ముంటే దేశాన్ని.. చైనాలా అభివృద్ధి చేయాల‌ని స‌వాల్ చేశారు. సాధార‌ణంగా 12 శాతం గ్రోత్ ఉంటే ఆరేళ్లలో దేశ ఎకాన‌మీ డ‌బుల్ అవుతుంది. 11 శాతం ఉంటే ఏడేళ్లలో డ‌బుల్ అవుతుంది. అది న‌రేంద్ర మోదీ, నిర్మ‌లా సీతారామ‌న్ చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఏ వ‌డ్డీ వ్యాపారిని అడిగినా చెబుతాడు. ఇది క‌ఠోర‌మైన వాస్త‌వం. 2025 వ‌ర‌కు 5 ట్రిలియ‌న్ ఎకాన‌మీకి తీసుకెళ్ల‌డానికి న‌రేంద్ర మోదీ అవ‌స‌రం లేదు. మీకు ద‌మ్ముంటే.. మీరు దేశాన్ని అభివృద్ధి చేయాల‌ని అనుకుంటే.. చైనాలా అభివృద్ధి చేయండి. సింగపూర్‌లా అభివృద్ధి చేయండి” అని కేసీఆర్ సవాల్ విసిరారు.