Arvind Kejriwal: కనీస మర్యాద మరిచిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్: ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు

కేజ్రీవాల్ బాడీ లాంగ్వేజ్ ప్రదర్శించిన తీరు, దృశ్యాలు వీడియో కాన్ఫరెన్స్ సమయంలో రికార్డు అయ్యాయి

Arvind Kejriwal: కనీస మర్యాద మరిచిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్: ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు

Krejiwal

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఈ సీఎంకు కనీస మర్యాద తెలుసా అంటూ కేజ్రీవాల్ తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..వివిధ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై ప్రధాని మోదీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. దాదాపు అన్ని రాష్ట్రాల సీఎంలు ప్రధాని మోదీతో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నారు. కాగా, రాష్ట్రాల్లో Covid – 19 పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతుండగా..సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎంతో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. ఓ వైపు ప్రధాని మాట్లాడుతుండగానే.. కేజ్రీవాల్ తన చేతులు రెండు పైకెత్తి తలపై పెట్టుకున్నారు. కేజ్రీవాల్ బాడీ లాంగ్వేజ్ ప్రదర్శించిన తీరు, హావభావాల దృశ్యాలు వీడియో కాన్ఫరెన్స్ సమయంలో రికార్డు అయ్యాయి.

Also read:Terror Letter: పంజాబ్ లో పేలుళ్లు సృష్టిస్తామంటూ జైష్-ఎ-మహమ్మద్ లేఖ: రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్

దీంతో ఆ దృశ్యాలను సేకరించిన బీజేపీ ఢిల్లీ నేతలు సీఎం కేజ్రీవాల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్షలో పాల్గొనడం ఇష్టం లేనివాడిగా, ఏదో బోర్ కొట్టి, వినలేక వింటున్నవాడిగా కేజ్రీవాల్ తన శరీర భాషను ప్రదర్శించారంటూ ఢిల్లీ బీజేపీ నేతలు మండిపడ్డారు. ఒక రాష్ట్ర సీఎం అయి ఉండి..దేశ ప్రధానితో ఎలా నడుచుకోవాలో తెలియదా అంటూ చురకలు అంటించారు. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ఇదే వీడియోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ, “అరవింద్ కేజ్రీవాల్ అసభ్య ప్రవర్తనతో తనను తాను అప్రతిష్టపాలు చేసుకున్నాడు” అని అన్నారు.

Also read:west bengal: బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన కోరుతున్న లాయర్లు.. ఎందుకంటే!

ఢిల్లీ బీజేపీ మీడియా హెడ్ నవీన్ కుమార్ జిందాల్ స్పందిస్తూ “సీఎం అరవింద్ కేజ్రీవాల్ వంచకుడు” అని సంభోదించారు. “ఈ వ్యక్తికి ప్రధాని ముందు కూర్చుని మాట్లాడే మర్యాద లేదు. ఎంత సిగ్గులేని మనిషి” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటు నెటిజన్లు సైతం సీఎం కేజ్రీవాల్ తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎంత సీఎం అయినా ప్రధాని అంతటి వ్యక్తి ముందు మర్యాద ప్రదర్శించాలని కొందరు కామెంట్ చేస్తే..రాజకీయంగా ఎలా ఉన్నా..ప్రజల విషయంలో మాత్రం సీఎంలు, పీఎంతో కలిసి కట్టుగా పనిచేయాలని కేజ్రీవాల్ నుద్దేశించి కామెంట్ చేశారు.

Also read:Loud Speakers: మతపరమైన ప్రదేశాలలో 6,031 లౌడ్ స్పీకర్లను శాంతియుతంగా తొలగించిన యూపీ ప్రభుత్వం