Telangana : బీఈడీ చదివి..భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేస్తున్న విద్యావలంటీర్ బతుకు చిత్రం

కరోనా కష్టంతో ఉపాధ్యాయులు వీధినపడ్డారు.విద్యావలంటీర్లు కూలీలుగా మారారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాక..కుటుంబాన్ని పోషించుకోవానికి కూలీపనిచేసుకుంటున్నారు.

Telangana : బీఈడీ చదివి..భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేస్తున్న విద్యావలంటీర్ బతుకు చిత్రం

Telangana Ma Bed Student House Construction Works

MA Bed Student Going To House Construction Works :పిల్లలకు విద్యాబుద్దులు చెప్పే ఉపాధ్యాయులు నడిరోడ్డున పడ్డారు. టీలు అమ్ముకుంటు..వీధి వీధి తిరిగి చీపుర్లు అమ్ముకుంటు, నడిరోడ్డుమీద కూరగాయలు అమ్ముకుని జీవిస్తున్నారు. కారణం కరోనా మహమ్మారి తెచ్చిన కష్టం. డ్రిలు చేసి, బీఈడీలు చేసినవారు కూడా రోజువారి కూలీలుగా మారిపోయిన దుస్థితి. కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్న వైనం. పుస్తకాలు పట్టుకుని పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు క్యారియర్ పట్టుకుని బంటా కూలీలుగా మారిపోయిన బతుకు చిత్రాలు కడు దీనంగా మారాయి. అటువంటి దుస్థితిలోనే ఉంది తెలంగాణకు చెందిన విద్యావాలంటీర్ కన్నం వరలక్ష్మి.

Read more : కూలీలుగా మారిన పంతుళ్లు.. ప్రయివేటు స్కూల్ టీచర్లపై కరోనా దెబ్బ

విద్యావలంటీర్ గా పనిచేసే కన్నం వరలక్ష్మి ఎంఏ బీఈడీ పూర్తి చేసింది. తెలంగాణలోని చెన్నారావుపేట మండలం బోజెర్వు పాఠశాలలో 2018లో విద్యావలంటీర్‌గా చేరింది. వరలక్ష్మికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబం కోసం కష్టపడుతోంది వరలక్ష్మి. కరోనా వల్ల స్కూళ్లు మూతపడి గత 20 నెలలుగా జీతాలు రాలేదు. దీంతో కుటుంబాన్ని పోషించుకోవటానికి తాపీ పనులకు వెళుతోంది. రోజుకు దాదాపు 10గంటలకు పైనే కష్టపడాలి. ప్రతీరోజు పనికి వెళితేనే నాలుగు రూపాయలు చేతికొస్తాయి. ఏరోజు పనిమానేసిన వచ్చేడబ్బుల్లో కోత తప్పదు. దీంతో ఆదివారం లేదు..సెలవులు అంతకంటే ఉండవు. ప్రతీరోజు క్యారియర్ లో కాస్త అన్నం పెట్టుకుని తాపీ పనికి వెళ్లుతోంది. సిమెంట్ పనికావటంతో అనారోగ్యాలు అదనంగా వస్తుంటాయి. ఇన్ని కష్టాలు పడినా వచ్చిన డబ్బులతో కుటుంబం గడవటం కష్టమే. అయినా తప్పదు. దీంతో ప్రభుత్వం తమలాంటివారి కష్టాలు అర్థం చేసుకోలని కోరుతోంది కన్నం వరలక్ష్మి.తమకు రావాల్సిన వేతనం ఇస్తే ఈ పరిస్థితిలో తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వేడుకుంటోంది.

Read more : కరోనా కష్టం..పండ్లు అమ్ముకుంటున్న బాలీవుడ్ నటుడు : మళ్లీ పాత వృత్తే దిక్కైంది

కరోనా సెకండ్ వేవ్ తగ్గిన క్రమంలో స్కూళ్లు తెరిచినా వీరిని రెన్యూవల్‌ చేయలేదు. దీంతో వీరి జీవితాలు మరింతగా కష్టాల్లో కూరుకుపోతున్న దుస్థితి నెలకొంది. 2019 విద్యాసంవత్సరానికి సంబంధించి నాలుగు నెలల పెండింగ్‌ వేతనాలు కూడా రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.

కరోనా కాలంలో ప్రైవేట్‌ టీచర్లకు భృతి కల్పించిన ప్రభుత్వం.. విద్యావలంటీర్లను మరిచిపోయింది. ఉన్నత విద్య చదువుకున్నా..ఉద్యోగాలు రాకపోవటంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావలంటీర్లుగా చేరారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా బోధిస్తున్నారు. కానీ ఈకరోనా వల్ల వీరి జీవితాలు రోడ్డున పడ్డాయి. బకాయి పడిన వేతనాలు కూడా ఇవ్వకపోవటం…రెన్యువల్ చేయకపోవటంతో కూలీలుగా మారి కుటుంబాలను పోషించుకోవాల్సి వస్తోంది. చదివిన చదువులకు అర్థం లేకపోవటం..తమకు ఎటువంటి ఉపయోగం లేకపోవటంతో కుమిలిపోతున్నారు విద్యావలంటీర్లు.ఇటువంటి కష్టం ఒక్క కన్నం వరలక్ష్మికే కాదు..ఎంతోమంది విద్యావలంటీర్ల పరిస్థితి ఇలాగే ఉంది. ఎవరికి తోచినపని వారు చేసుకుంటు కుటుంబాల్ని పోషించుకుంటున్నారు.

పల్లె ప్రాంత విద్యార్థులకు సమాచార మాధ్యమాలు అందుబాటులో లేనప్పుడు కీలకంగా వ్యవహరించిన విద్యావంటీర్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీలో 30 శాతం ఫిట్‌మెంట్‌ వలంటీర్లకు వర్తింపజేస్తామన్నారు. గురుకులాల్లోని కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులు, గెస్టు టీచర్లు, సీఆర్సీలకు విధులు అప్పగించి జీతాలు ఇస్తున్న ప్రభుత్వం అదే విద్యార్హతలున్న తమపై కనికరం చూపడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కష్టాన్ని ఎదుర్కొంటున్న జీవితాలను కొనసాగిస్తున్న వీరిపై ఇకనైనా ప్రభుత్వం దృష్టిపెట్టి వారికి పెడ్డింగ్ వేతనాలతో పాటు రెన్యువల్ కూడా చేయాలని డిమాండ్ వస్తున్నాయి.