Delhi : మెట్రోలో భిక్షాటన చేస్తున్న వ్యక్తి .. రియాక్టైన మెట్రో అధికారులు

ఢిల్లీ మెట్రోలో కొట్లాటలు, రీల్స్, పోల్ డ్యాన్సుల హంగామా తర్వాత తాజాగా ఓ వ్యక్తి భిక్షాటన చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై మెట్రో అధికారులు స్పందించారు.

Delhi : మెట్రోలో భిక్షాటన చేస్తున్న వ్యక్తి .. రియాక్టైన మెట్రో అధికారులు

Delhi

Updated On : July 26, 2023 / 11:25 AM IST

Delhi : ఢిల్లీ మెట్రో ఎప్పుడు వీడియోలు, వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటుంది. తాజాగా మెట్రోలో ఓ వ్యక్తి భిక్షాటన చేస్తున్న వీడియో వైరల్ అయ్యింది. దీనిపై మెట్రో అధికారులు స్పందించారు.

Delhi Metro : ఢిల్లీ మెట్రోలో యువతుల పోల్ డ్యాన్స్ .. DMRC ఎందుకు పట్టించుకోవట్లేదంటూ నెటిజన్లు ఫైర్

ఢిల్లీ మెట్రోలో రకరకాల వీడియోలు ప్రత్యక్షం అవుతుంటాయి. కొన్ని సరదాగా, కొన్ని ఆకట్టుకునేలా, కొన్ని వివాదాలతో  వైవిధ్యభరితమైన సంఘటనల మధ్య ఢిల్లీ మెట్రో ప్రయాణం సాగుతూ ఉంటుంది. తాజాగా ఢిల్లీ మెట్రోలో ఓ వ్యక్తి భిక్షాటన చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో కంటెంట్ జనాన్ని ఆందోళన మరియు చర్చకు దారి తీసింది. @writerindenial అనే ట్విట్టర్ యూజర్ ‘మెట్రోలో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరిగింది?.. ఓ దివ్యాంగుడు మెట్రో కోచ్‌లో భిక్షాటన చేస్తున్నాడు’ అనే శీర్షికతో ఢిల్లీ మెట్రో అధికారులకు ఈ వీడియోను ట్యాగ్ చేసారు.

Delhi Metro : ఢిల్లీ మెట్రోలో యువకుడిని తిట్టి, చెంప దెబ్బ కొట్టిన మహిళ వీడియో వైరల్

ఢిల్లీ మెట్రో అధికారులు ఈ ట్వీట్‌పై స్పందించారు. వారు వీడియోను రీట్వీట్ చేస్తూ సంఘటన వివరాలు.. అది జరిగిన కోచ్ నంబర్ గురించి మరింత సమాచారం కోరారు. ఇక నెటిజన్లు భిక్షాటన చేస్తున్న వ్యక్తి పట్ల సానుభూతి తెలిపారు. దేశంలో జీవనోపాధికి ప్రత్యామ్నాయ మార్గాలు లేక ఇలాంటి మార్గాలు వెతుక్కుంటున్నారని అభిప్రాయపడ్డారు.