Teppotsavam : అమ్మవారు తెప్పోత్సవం రద్దు..ఫంట్ మీదే పూజలు

తెప్పోత్సవం నిర్వహిస్తే ప్రమాదం ఉంటుందని, ఫంట్ మీద అమ్మవారికి పూజలు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు.

Teppotsavam : అమ్మవారు తెప్పోత్సవం రద్దు..ఫంట్ మీదే పూజలు

Teppotsavam Vijayawada

Durgamma Teppotsavam : దేవీ నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అమ్మవారి నామస్మరణతతో మారుమ్రోగుతున్నాయి. ఏపీ రాష్ట్రంలోని ఇంద్రకీలాద్రిపై భక్తులు పోటెత్తారు. కోవిడ్ నిబంధనలు, ఆంక్షల నడుమ భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. నవరాత్రులు ముగింపు దశకు చేరుకుంటుండడంతో దుర్గమ్మ నదీ విహారానికి ఆలయ అర్చకులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం ఉధృతంగా ఉంది. దీంతో అమ్మవారి తెప్పోత్సవంపై సందిగ్ధత నెలకొంది.

Read More : Hyderabad Markets : దసరా పండగతో హైదరాబాద్‌ లో రద్దీగా మార్కెట్లు

2021, అక్టోబర్ 14వ తేదీ గురువారం జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధ్యక్షతన కో ఆర్డినేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెప్పోత్సవంపై చర్చించారు. తెప్పోత్సవం నిర్వహిస్తే ప్రమాదం ఉంటుందని, ఫంట్ మీద అమ్మవారికి పూజలు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో భక్తులు నిరుత్సాహానికి గురయ్యారు. దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అన్ని నగరాలు, పట్టణాలు, పల్లెల్లో దసరా సంబరాలు అంబరాన్నంటాయి.

Read More : Telugu Academy : తెలుగు అకాడమీ కేసు విచారణలో నిందితుల కట్టుకథలు

ప్రతీ రోజు ఒక్కో అలంకారంలో అమ్మవారిని దర్శిస్తున్నారు భక్తులు. 2021, అక్టోబర్ 14వ తేదీ గురువారం నవమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఉదయం నుంచే హారతితో దేశంలోని ఆలయాల్లో పూజలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 15వ తేదీ శుక్రవారం ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. దీంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అమ్మవారిని దర్శించి తరించిపోతున్నారు భక్తజనం. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పూజలు చేసి భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.