Govt Jobs: నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌.. 2,440 ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్

తెలంగాణ ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌కు మ‌రోసారి గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 2,440 ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తిచ్చింది. విద్యాశాఖ‌, ఆర్కైవ్స్ శాఖ‌ల్లో పోస్టుల భ‌ర్తీకి అనుమ‌తి ఇస్తూ ఆర్థిక శాఖ ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Govt Jobs: నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌.. 2,440 ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్

Govt Jobs: తెలంగాణ ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌కు మ‌రోసారి గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 2,440 ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తిచ్చింది. విద్యాశాఖ‌, ఆర్కైవ్స్ శాఖ‌ల్లో పోస్టుల భ‌ర్తీకి అనుమ‌తి ఇస్తూ ఆర్థిక శాఖ ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ సంద‌ర్భంగా ఆర్థిక‌, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీష్‌రావు త‌న ట్విట‌ర్ ఖాతాలో పోస్టుల భ‌ర్తీల వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

Telangana Govt jobs : తెలంగాణలో కొలువుల జాతర..కోచింగ్‌ సెంటర్ల బాటపట్టిన నిరుద్యోగులు

ఎడ్యుకేషన్, ఆర్కైవ్స్ విభాగాల్లో మరో 2,440 ఖాళీల భ‌ర్తీకోసం నోటిఫికేషన్ విడుదల కావడంతో తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉద్యోగాల వర్షం కురుస్తోంద‌న్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో ఇప్పటివరకు ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 49,428 ఉద్యోగాలకు ఉత్తర్వులు ఇచ్చింద‌ని మంత్రి హ‌రీష్‌రావు తెలిపారు.

ఇదిలాఉంటే ప్ర‌భుత్వం మొత్తం 2,400 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. వీటిలో 1,392 జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ పోస్టులు, ఇంటర్మీడియ‌ట్ విద్యా విభాగంలో 40 లైబ్రేరియ‌న్‌, 91 ఫిజిక‌ల్ డైరెక్ట‌ర్ పోస్టులు, ఆర్కైవ్స్ విభాగంలో 14 పోస్టులు, పాలిటెక్నిక్ క‌ళాశాల‌ల్లో 247 లెక్చ‌ర‌ర్ పోస్టులు, 14 ఇన్ స్ట్ర‌క్ట‌ర్‌, 31 లైబ్రేరియ‌న్‌, ఐదు మాట్ర‌న్‌, 25 ఎల‌క్ట్రీషియ‌న్‌, 37పీడీ పోస్టుల భ‌ర్తీకి అనుమ‌తి ఇచ్చింది. అయితే క‌ళాశాల విభాగంలో 491 లెక్చ‌ర‌ర్‌, 24 లైబ్రేరియ‌న్‌, 29 ఫిజిక‌ల్ డైరెక్ట‌ర్ పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు.