Harish Rao: కాంగ్రెస్‌, బీజేపీలు క‌లిశాయి.. ఓటమితో కుంగిపోము -హరీష్ రావు

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ స్ధానానికి  జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ధి మాజీ మంత్రి ఈటల రాజేందర్ గెలుపొందారు. ఈటల గెలుపుపై టీఆర్ ఎస్ నేత రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు

Harish Rao: కాంగ్రెస్‌, బీజేపీలు క‌లిశాయి.. ఓటమితో కుంగిపోము -హరీష్ రావు

Harish Rao In Eetala Victory

Updated On : November 2, 2021 / 7:20 PM IST

Harish Rao On Eatala Victory :  కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ స్ధానానికి  జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ధి మాజీ మంత్రి ఈటల రాజేందర్ గెలుపొందారు. ఈటల గెలుపుపై టీఆర్ ఎస్ నేత రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు స్పందించారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో ప్ర‌జాతీర్పును శిర‌సావ‌హిస్తామని ఆర్ధిక మంత్రి హరీష్ రావు అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్‌ఎస్ పార్టీకి ఓట్లేసిన ఓట‌ర్లంద‌రికీ పేరుపేరున కృత‌జ్ఙ‌త‌లు చెప్పారు. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డ్డ కార్య‌క‌ర్త‌ల‌కు ద‌న్య‌వాదాలు తెలుపుతూ ఆయన … టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేమీ త‌గ్గ‌లేదని వివరించారు.

అయితే, దేశంలో ఎక్క‌డ‌లేని విధంగా హుజురాబాద్‌లో కాంగ్రెస్‌, బీజేపీలు క‌లిసి ప‌నిచేశాయని ఆరోపించారు హరీష్ రావు. ఈ విష‌యాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌లు కూడా చెప్తున్నారు. జాతీయ స్థాయిలో కొట్లాడే బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్ర స్థాయిలో కుమ్మ‌క్కు కావ‌డాన్ని రాష్ట్ర ప్ర‌జలంతా గ‌మ‌నిస్తున్నారని హరీష్ రావు అన్నారు.

Also Read : Huzurabad By Poll : ఓటమిపై స్పందించిన కేటీఆర్.. 20 ఏళ్లలో ఇలాంటివి ఎన్నో చూసాం

ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎన్నికలో ఓట‌మితో కుంగిపోదు.. గెలిచిన‌నాడు పొంగిపోలేదు. ఓడినా.. గెలిచిన టీఆర్ ఎస్ పార్టీ తెలంగాణ ప్ర‌జ‌ల ప‌క్షాన ఉండి ప‌నిచేస్తుందని హరీష్ రావు చెప్పారు.