HICC : శత్రుదుర్భేద్యంగా హెచ్‌ఐసీసీ, నోవాటెల్‌ పరిసర ప్రాంతాలు.. 2,500 మంది పోలీసులతో పహారా

హెచ్‌ఐసీసీ, నోవాటెల్‌ పరిసర ప్రాంతాలను శత్రుదుర్భేద్యంగా మార్చారు. 2వేల 500 మంది పోలీసులతో పహారా ఏర్పాటు చేశారు. సరైన పాస్‌లు ఉంటేనే లోనికి అనుమతి ఇస్తారు.

HICC : శత్రుదుర్భేద్యంగా హెచ్‌ఐసీసీ, నోవాటెల్‌ పరిసర ప్రాంతాలు.. 2,500 మంది పోలీసులతో పహారా

Hicc

HICC : హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో బీజేపీ నేతల హడావిడి నెలకొంది. జాతీయ నేతలు, కేంద్రమంత్రులు వరుసగా వస్తున్నారు. వీవీఐపీల కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నారు. బైరోడ్‌లో మరోసారి ప్రధాని కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. హెలిపాడ్‌ నుంచి హెచ్‌ఐసీసీ వరకు వీవీఐపీ మూమెంట్‌ను సక్సెస్‌ ఫుల్‌గా పూర్తి చేశారు పోలీసులు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ కాన్వాయ్‌లను నోవాటెల్‌, హైటెక్స్‌లో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.

bjp: టీఆర్ఎస్‌తో మాకు పోటీ ఏంటీ?: బండి సంజ‌య్‌

హెచ్‌ఐసీసీ, నోవాటెల్‌ పరిసర ప్రాంతాలను శత్రుదుర్భేద్యంగా మార్చారు. 2వేల 500 మంది పోలీసులతో పహారా ఏర్పాటు చేశారు. సరైన పాస్‌లు ఉంటేనే లోనికి అనుమతి ఇస్తారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు జేపీ నడ్డా హెచ్‌ఐసీసీకి చేరుకోనున్నారు. గోల్కొండ పేరుతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్నారు. నడ్డాకు తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాలతో స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. ఆదిలాబాద్‌ గుస్సాడి నృత్యం, లంబాడీ నృత్యాలు, కోలాటాలు, డప్పు, డోలు వాయిద్యాలతో స్వాగతం పలకనున్నారు.

Traffic restrictions: నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏఏ ఏరియాల్లో అంటే..

హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. దాదాపు 18 సంవత్సరాల తర్వాత బీజేపీ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదికగా మారింది. బీజేపీ జాతీయ అగ్రనాయకులు ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా తోపాటు కేంద్ర మంత్రులు, వందల మంది జాతీయ ప్రతినిధులు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొననున్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 2-3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో పాల్గొనేందుకు బీజేపీ ప్రతినిధులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు.

Strong Security: భద్రతా వలయంలో మోదీ పర్యటించే ఏరియాలు.. మెట్రో సేవలు బంద్..

హైదరాబాద్ లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశం.. బీజేపీలో మాత్రమే కాదు, తెలంగాణ రాజకీయాలపైనా తన ముద్రవేయబోతోంది. జులై 2-3 తేదీల్లో జరిగే ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం మొత్తం భాగ్యనగరానికి తరలిరానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలతో పాటు ముఖ్యమైన నియామకాలు కూడా చేపట్టనున్నారు. కొవిడ్ తర్వాత జరుగుతున్న తొలి పూర్తి స్థాయి కార్యవర్గ సమావేశాన్ని తెలంగాణలో నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో పార్టీ విస్తరణ కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న కమలదళం.. ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో పార్టీ విస్తరణకు మార్గం నిర్మించనుంది.

ఈ సమావేశాల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, పార్లమెంటరీ చైర్‌పర్సన్ హోదాలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలో సభ్యుడిగా ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కీలక నాయకత్వం వ్యవహరిస్తారు. వీరితో పాటు పార్టీలో కీలకనేత అయిన హోంమంత్రి అమిత్ షా, అదే విధంగా 19 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఇందులో సభ్యులుగా ఉన్న 80 మంది ఆఫీసు బేరర్లు హాజరవుతారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి హాజరయ్యే ఈ సమావేశాల్లో కీలకమైన అంశాలపై చర్చించే అవకాశం ఉంది.