ICC ODI Rankings : వన్డే ర్యాంకింగ్స్.. తన స్థానాన్ని నిలుపుకున్న భారత్

ఇంగ్లండ్ పై వన్డే సిరీస్ నెగ్గిన భారత్.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో తన స్థానాన్ని పదిలపరుచుకుంది. ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్ ను ప్రకటించగా.. టీమిండియా తన మూడో స్థానాన్ని నిలుపుకుంది.

ICC ODI Rankings : వన్డే ర్యాంకింగ్స్.. తన స్థానాన్ని నిలుపుకున్న భారత్

Icc Odi Rankings (2)

ICC ODI Rankings : ఇంగ్లండ్ పై వన్డే సిరీస్ నెగ్గిన భారత్.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో తన స్థానాన్ని పదిలపరుచుకుంది. మాంచెస్టర్ లో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో పంత్ వీరోచిత సెంచరీ, పాండ్యా పోరాటం ద్వారా టీమిండియా అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో 2-1 తేడాతో వన్డే సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్ ను ప్రకటించగా.. టీమిండియా తన మూడో స్థానాన్ని నిలుపుకుంది.

England vs India: రిష‌బ్ పంత్ అద్భుత ఆట‌తీరుపై స‌చిన్, గంగూలీ, సెహ్వాగ్ ప్ర‌శంస‌ల జ‌ల్లు

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు నెంబర్ వన్ గా కొనసాగుతోంది. కివీస్ ఖాతాలో 128 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. 121 పాయింట్లతో ఇంగ్లండ్ సెకండ్ ప్లేస్ లో ఉంది. మరికొన్ని రోజుల్లో వెస్టిండీస్ తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇందులో గెలిస్తే టీమిండియా ఖాతాలో మరిన్ని రేటింగ్ పాయింట్లు చేరే అవకాశం ఉంది.

ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 109 పాయింట్లు ఉన్నాయి. టాప్-10 వన్డే జట్లలో భారత్ తర్వాతి స్థానాల్లో వరుసగా పాకిస్తాన్ (106), ఆస్ట్రేలియా (101), దక్షిణాఫ్రికా (99), బంగ్లాదేశ్ (98), శ్రీలంక (92), వెస్టిండీస్ (70), అప్ఘానిస్తాన్ (69) ఉన్నాయి.

Hardik Pandya Record : ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా హార్దిక్ పాండ్యా రికార్డ్

కాగా, కొన్ని రోజుల్లో ఈ ర్యాంకులు మారే అవకాశం ఉంది. పలు జట్లు వన్డే సిరీస్ లో ఆడనున్నాయి. సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి. సౌతాఫ్రికా ప్రస్తుతం 99 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. పాకిస్తాన్ కు, సౌతాఫ్రికా మధ్య ఏడు పాయింట్ల వ్యత్యాసమే ఉంది. ఇంగ్లండ్ తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తే దక్షిణాఫ్రికా నాలుగో స్తానానికి వచ్చే అవకాశం ఉంది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

70 పాయింట్లతో 9వ స్థానంలో ఉన్న వెస్టిండీస్.. భారత్ తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసినా.. తన ర్యాంకుని మెరుగుపరుచుకునే అవకాశం లేదు. భారత్, విండీస్ మధ్య వన్డే సిరీస్ జులై 22 నుంచి ప్రారంభం కానుంది. ఇటీవలే పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లతో జరిగిన వన్డే సిరీస్ లను వెస్టిండీస్ కోల్పోయింది. ఆ రెండు జట్లు విండీస్ ను వైట్ వాష్ చేశాయి.