Karnataka Election Result 2023: జేడీఎస్‌కు షాకిచ్చిన కన్నడ ఓటర్లు.. కుమారస్వామి ఆశలు గల్లంతు

మా సహకారంతోనే కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని భావించిన జేడీఎస్ పార్టీ నేతలకు తాజా ఫలితాలు మింగుడుపడటం లేదు.

Karnataka Election Result 2023: జేడీఎస్‌కు షాకిచ్చిన కన్నడ ఓటర్లు.. కుమారస్వామి ఆశలు గల్లంతు

jds leader kumara swamy

Karnataka Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ (congress party) దూకుడు కొనసాగిస్తోంది. రాష్ట్రంలో 224 స్థానాలకుగాను ప్రభుత్వం ఏర్పాటుకు 113 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంది. అయితే, కాంగ్రెస్ పార్టీ 120పైగా స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో పూర్తిస్థాయి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీ నేతలు సన్నద్ధమవుతున్నారు. కర్ణాటకలో భారీ విజయంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వద్ద ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.

Siddaramaiah : వరుణ నుంచి సిద్ద రామయ్య విజయం..మరోసారి సీఎం అవుతారా?

జేడీఎస్ ఆశలు గల్లంతు ..

కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఫలితాలు సాధించడంతో జేడీఎస్ ఆశలకు గండి పడినట్లయింది. కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్‌లలో ఏ పార్టీకి మెజార్టీ రాదని, జేడీఎస్ సహకారంతోనే కర్ణాటకలో ప్రభుత్వం ఫామ్ అవుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తూ వచ్చారు. ఎన్నికల పోలింగ్ తరువాత కూడా పలు ఎగ్జిట్ పోల్స్ హంగ్ వస్తుందని, జేడీఎస్ కీలకంగా మారుతుందని అంచనా వేశాయి. దీంతో 2018 ఎన్నికల్లోలా మరోసారి సీఎం పీఠాన్ని అదిరోహించే అవకాశం వస్తుందని జేడీఎస్ నేత కుమారస్వామి, ఆ పార్టీ నేతలు భావించారు. తాజాగా ఫలితాలను చూస్తే.. కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి మెజార్టీతో అధికారంలోకి వచ్చేఅవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో జేడీఎస్ నేతల ఆశలపై కన్నడ ప్రజలు నీళ్లు చల్లినట్లయింది.

Revanth Reddy : కర్ణాటక ఎన్నికల ఫలితాలపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

గతం కంటే తగ్గిన సీట్లు..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నా కొద్దీ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ పెరుగుతుంది. భారీ విజయం దిశగా ఆపార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పలువురు పార్టీ కీలక నేతలు ఇప్పటికే విజయం సాధించారు. మా సహకారంతోనే కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని భావించిన జేడీఎస్ పార్టీ నేతలకు ఈ ఫలితాలు మింగుడు పడనవిగా మారాయి. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించడం అలా ఉంచితే, ఆ పార్టీకి 2018లో వచ్చిన సీట్లుకూడా వచ్చే పరిస్థితి లేదు. గత 2018 ఎన్నికల్లో జేడీఎస్ 37 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. అయితే, ప్రస్తుత ఫలితాల్లో ఆ పార్టీ అభ్యర్థులు 20 నుంచి 22 స్థానాలకే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

DK Shivakumar : కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ విజయం .. ఎనిమిదోసారి సత్తా చాటిన వొక్కలిగ వారసుడు

పుంజుకున్న కాంగ్రెస్..

కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. దాదాపు 120 స్థానాలకుపైగా ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉంది. గతం ఎన్నికల సమయంలో 80 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ఈ దఫా 120కిపైగా స్థానాల్లో విజయం సాధించి పూర్తిస్థాయి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా దూసుకెళ్తుంది. బీజేపీ మెజార్టీకూడా గతంకంటే తగ్గింది. 2018లో బీజేపీ 104 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించగా.. ప్రస్తుత ఫలితాల్లో కేవలం 65 నుంచి 70 స్థానాలకే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి తాజా ఫలితాలతో బీజేపీ, జేడీఎస్ ఆశలు గల్లంతయ్యాయి.