Kejriwal: ఎన్నికల్లో ఓట్లు వేసిన ప్రజలే.. మీ ఎమ్మెల్యే పార్టీ మారితే కేసు పెట్టొచ్చు!

గోవా భవిష్యత్తు కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయాలని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.

Kejriwal: ఎన్నికల్లో ఓట్లు వేసిన ప్రజలే.. మీ ఎమ్మెల్యే పార్టీ మారితే కేసు పెట్టొచ్చు!

Arvind Kejriwal

Kejriwal: గోవా భవిష్యత్తు కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయాలని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. బీజేపీ, కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీల మద్దతుదారులకు విజ్ఞప్తి చేసేందుకే గోవా వచ్చినట్లు చెప్పిన కేజ్రీవాల్.. ఆమ్ ఆద్మీ ఆప్ పార్టీలో చేరమని అడగట్లేదు కానీ, మీ స్వంత పార్టీలో ఉండే, గోవా భవిష్యత్తు కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయాలని కోరారు.

గత 15 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ గోవాలో ఉంది, కానీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని బీజేపీపై మండిపడ్డారు కేజ్రీవాల్. గోవాను కాంగ్రెస్ కూడా చాలా ఏళ్లు పాలించిందని, ఇప్పుడు ఆ పార్టీ నేతలు బీజేపీలో చేరారని అన్నారు. అయితే, ఎన్నికల్లో ఏదైనా పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి చేరడం సమస్యగా మారిందని, ఇలాంటి పోకడలకు చెక్ పెట్టేందుకు కొత్త మార్గం అవలంభిస్తున్నట్లు చెప్పారు అరవింద్ కేజ్రీవాల్.

తమ పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీలకు మారే ఎమ్మెల్యేలపై ప్రజలే కేసు పెట్టే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు కేజ్రీవాల్. గోవాలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం లేకపోయినా కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, అవసరమైన బలాన్ని సంపాదించడానికి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను, స్వతంత్ర ఎమ్మెల్యేలను కలుపుకుంది. ఓటర్ల నిర్ణయాన్ని కాదని అధికారం దక్కించుకున్న బీజేపీపై విమర్శలు కూడా అదేస్థాయిలో వచ్చాయి.

ఈ క్రమంలోనే ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్.. ఆప్ నుంచి పోటీ చేసే అభ్యర్థులతో ఫిరాయింపులకు పాల్పడమని అఫిడవిట్లపై సంతకం చేయించుకున్నారు. గోవాలో ఎన్నికైన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలలో చేరితే స్థానిక ఓటర్లు వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చని ప్రకటించారు కేజ్రీవాల్.