Maharashtra : మనీ ల్యాండరింగ్ కేసులో మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్

మనీలాండరింగ్‌ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌‌ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. 12 గంటలు విచారించిన అధికారులు అనిల్‌ దేశ్‌ముఖ్‌‌ను కస్టడీలోకి తీసుకున్నారు.

Maharashtra : మనీ ల్యాండరింగ్ కేసులో మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్

Former Home Minister Anil Deshmukh, Arrested

former home minister anil deshmukh, arrested : మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌‌ అరెస్ట్ అయ్యారు. ముంబై కార్యాలయంలో 12 గంటలపైనే విచారించిన తరువాత అనిల్‌ దేశ్‌ముఖ్‌‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ సోమవారం రాత్రి అరెస్ట్ చేసికష్టడీలోకి తీసుకున్నారు. 71 ఏళ్ల అనిల్ దేశ్‌ముఖ్ ని మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ) నిబంధనల ప్రకారం అరెస్టు చేశామని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని నిర్దేశించినట్టు ఆరోపణలు రావడంతో అనిల్‌ దేశ్‌ముఖ్‌ మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మనీలాండరింగ్‌ అంశంలో అనిల్‌ దేశ్‌ముఖ్‌కు ఈడీ దాదాపు ఐదుసార్లు సమన్లు జారీ చేసింది. కానీ అనిల్ దేశ్ ముఖ్ వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు.

Read more : మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ పై సిబిఐ ఉచ్చు

ఈడీ పంపించిన సమన్లపై అనిల్ బాంబే హైకోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ కూడా ఆయన ఆశించిన ఫలితం దక్కలేదు. న్యాయస్థానంలో కూడా చుక్కెదురైంది. కోర్టు తన పిటిషన్‌ను తిరస్కరించింది. ఇటీవల దేశ్‌ముఖ్‌ ఆస్తులపై ఈడీ దాడి చేసి పలు ఆస్తులను జప్తు చేసింది. ముంబయిలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలంటూ సచిన్‌ వాజేను అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆదేశించినట్లు ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ చేసిన ఆరోపణలు మహారాష్ట్రంల పలు సంచలన రేపాయి. దీంతో అనిల్‌ దేశ్‌ముఖ్‌ తన పదవికి రాజీనామా చేయకతప్పలేదు.

ఈ ఆరోపణల నేపథ్యంలో అనిల్‌ దేశ్‌ముఖ్‌పై విచారణ చేపట్టాలని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. మనీలాండరింగ్‌పై తనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇటీవల అనిల్‌ దేశ్‌ముఖ్‌ తీవ్రంగా ఖండించారు. తనపై వచ్చిన ఈ ఆరోపణలన్నీ అవాస్తమనీ..ఇవన్నీ నాపై పన్నిన కుట్ర అంటూ ఆయన ఇటీవల ఓ వీడియోను రిలీజ్ చేశారు. కానీ ఆయనపై విచారణలు మాత్రం కొనసాగుతునే ఉన్నాయి. ఆయనకు సంబంధించిన పలు ఆస్తుల్ని కూడా జప్తు చేయటంతో అనిల్ మరంతగా చిక్కుకుపోయినట్లుగా అయ్యింది.

Read more : Good Mosquitoes : ఈ దోమలు ‘మంచి’వి : డెంగ్యూని నివారిస్తాయి

అంతేకాదు అనిల్‌ దేశ్‌ముఖ్‌ లంచం ఆరోపణల కేసులో సీబీఐ కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తిని అరెస్టు చేసింది. అనిల్ దేశ్‌ముఖ్‌పై ఆరోపణలు చేసిన ఐపీఎస్ అధికారి పరంబీర్ సింగ్‌పై కూడా పలు ఆరోపణలు రావడంతో కేసులు నమోదయ్యాయి. ఈక్రమంలో పరంబీర్ పై లుక్‌ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో పరంబీర్ పరారీలో ఉన్నారు. ఆయనను పట్టుకోవటానికి అధికారులు గాలింపు ముమ్మురం చేశారు.