Traffic Challan : మిగిలింది 5 రోజులే.. చలాన్లు చెల్లించకపోతే తాట తీస్తారు

ఈనెల 1న రాయితీ ప్రకటించగానే.. మొదటి నాలుగు రోజులు అనూహ్య స్పందన వచ్చింది. మూడు పోలీస్ కమిషనరేట్‌ల పరిధిలోని వాహనదారులు పెండింగ్‌ చలాన్లు...

Traffic Challan : మిగిలింది 5 రోజులే.. చలాన్లు చెల్లించకపోతే తాట తీస్తారు

Traffic E Challans

Traffic Challan Discount : ఇక మిగిలింది 5 రోజులు మాత్రమే. వాహనాలపై ఉన్న పెండింగ్‌ చలాన్లు డిస్కౌంట్‌తో చెల్లించేందుకు మిగిలిన గడువు. ట్రాఫిక్‌ పోలీసులు ఇచ్చిన గడువు ముగిసేలోపు చలాన్లు చెల్లించకపోతే.. తర్వాత ముక్కుపిండి వసూలు చేయడం ఖాయం. కరోనా కారణంగా తెలంగాణ ప్రజల ఆదాయం తగ్గిందని.. అందుకే ప్రజలపై భారం పడకూడదనే.. రాయితీని ప్రకటించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పోలీస్‌ల వద్దకు వెళ్లకుండా.. ఆన్‌లైన్‌లో చెల్లించే వెసలుబాటును కల్పించారు. ఈ నెల 31 వరకు ట్రాఫిక్‌ పెండింగ్‌ చలాన్లను క్లియర్‌ చేసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. గడువులోగా చలాన్లు క్లియర్ చేసుకోలేకపోతే తర్వాత భారీగా మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు.

Read More : Traffic E-Challans : పెండింగ్ ట్రాఫిక్ చాలానాల ద్వారా రూ. 112.98 కోట్లు ఆదాయం

అయితే ఈనెల 1న రాయితీ ప్రకటించగానే.. మొదటి నాలుగు రోజులు అనూహ్య స్పందన వచ్చింది. మూడు పోలీస్ కమిషనరేట్‌ల పరిధిలోని వాహనదారులు పెండింగ్‌ చలాన్లు క్లియర్‌ చేసుకునేందుకు ఉత్సాహం చూపించారు. దాదాపు 650 కోట్ల రూపాయలకు పైగా పెండింగ్‌ చలాన్స్‌ క్లియర్ అయ్యాయి. ఇందులో రాయితీ పోను 190 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వచ్చి చేరాయని.. నగర్ ట్రాఫిక్ పోలీస్‌ జాయింట్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. రోజుకు 7 నుంచి 10 లక్షల చలాన్లు క్లియర్ అవుతున్నాయని పోలీసు అధికారులు అంటున్నారు. మార్చి 31 వరకే ఈ అవకాశం ఉంటుందని.. తర్వాత గడువు పొడిగించే ఆలోచన లేదని చెప్పారు.

Read More : Traffic Challans : నేటి నుంచి ట్రాఫిక్ చలాన్ల రాయతీ అమలు.. ఆన్ లైన్ లోనే చెల్లింపు

ఇప్పటి వరకు 1500 కోట్ల విలువ చేసే చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఇందులో 60 నుంచి 70 శాతం క్లియర్ అవుతాయని ఆశిస్తున్నారు. గడువు తర్వాత ట్రాఫిక్ రూల్స్ వయెలెట్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీస్ అధికారులు హెచ్చరించారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారిపై ఛార్జ్ షీట్‌లు వేయనున్నట్లు చెప్పారు. ఏప్రిల్‌ నుంచి చార్జ్ షీట్లు వేస్తామన్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రవ్‌ విషయంలో ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తున్నారు. అలాంటి వారిని జైలుకు సైతం పంపుతామని హెచ్చరించారు.

Read More : Traffic Challans : పెండింగ్ చలాన్లకు ఫుల్ రెస్పాండ్..3 రోజుల్లో రూ. 39 కోట్లు

తెలంగాణ పోలీసుల శాఖ 2022, మార్చి 01వ తేదీ నుంచి మార్చి 30 వరకు పెండింగ్ చలానాలు చెల్లించేందుకు ప్రత్యేక అవకాశం కల్పించింది. బైక్‌లు, కార్లు, లారీలు, ఆటోలపై ఉన్న ఫైన్లను రాబట్టేందుకు భారీ ఆఫర్లు ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న చలాన్లపై ద్విచక్రవాహనదారులు, ఆటోలకు 75శాతం డిస్కౌంట్‌ కల్పించింది. కార్లకు 50శాతం చెల్లించాల్సి ఉంటుంది. తోపుడు బళ్లకు 25 శాతం చెల్లిస్తే సరిపోతుంది.నో మాస్క్‌ కేసుల్లో 9 వందల రూపాయల వరకు మాఫీ చేసింది. ఎక్కువగా పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడుతున్న నేపథ్యంలో పోలీసుశాఖ పెండింగ్‌ చలాన్లపై రాయితీని ప్రకటించింది. హైదరాబాద్‌లో లక్షా 75 వేల చలానాలు పెండింగ్‌లో ఉన్నాయని అంచనా.