Congress-Himachal: హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలుపుపై ఖర్గే, రాహుల్ గాంధీ స్పందన

హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలుపుపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. హిమాచల్ ప్రదేశ్ లో తమ పార్టీ గెలుపునకు గాంధీ కుటుంబమే కారణమని ఖర్గే చెప్పారు. రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర కూడా తమ పార్టీ గెలుపునకు కారణమైందని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుతామని మరోసారి భరోసా ఇస్తున్నట్లు చెబుతూ రాహుల్ హిందీలో ట్వీట్ చేశారు.

Congress-Himachal: హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలుపుపై ఖర్గే, రాహుల్ గాంధీ స్పందన

Congress-Himachal

Congress-Himachal: హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలుపుపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. హిమాచల్ ప్రదేశ్ లో తమ పార్టీ గెలుపునకు గాంధీ కుటుంబమే కారణమని ఖర్గే చెప్పారు. రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర కూడా తమ పార్టీ గెలుపునకు కారణమైందని అన్నారు.

హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్న తమ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీకి కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆశీస్సులు కూడా తమకు ఉన్నాయని చెప్పారు. ఈ విజయాన్ని అందించినందుకు ప్రజలు, తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు.

హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపును నిర్ణయాత్మక గెలుపుగా ఆయన అభివర్ణించారు. తమ పార్టీ నేతలు కష్టపడి పనిచేసిన తీరుకి కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించారని చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుతామని మరోసారి భరోసా ఇస్తున్నానంటూ హిందీలో ట్వీట్ చేశారు.

కాగా, రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర 91వ రోజు కొనసాగుతోంది. గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి ఘోర ఓటమి ఎదురైనప్పటికీ హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం ఆ పార్టీ విజయం సాధించింది. హిమాచల్ ప్రదేశ్ లో స్పష్టమైన మెజారిటీ సాధించడంతో ఆ పార్టీ రాష్ట్ర నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవికి బీజేపీ నేత జైరాం ఠాకూర్ రాజీనామా చేశారు.

Gujarat Polls: తన రికార్డును తానే బద్దలు కొడుతూ కాంగ్రెస్ రికార్డును కూడా బద్దలు కొట్టిన బీజేపీ