Ram Charan-NTR : నా బ్రదర్ ఎన్టీఆర్, నేను కలిసి వాళ్ళతో పోటీ పడుతున్నాము.. చరణ్ ట్వీట్..

లేటెస్ట్ గా క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్ పోటీలో ఇప్పుడు యన్టీఆర్, రామ్ చరణ్ బెస్ట్ యాక్టర్స్ అవార్డు కోసం ఏకంగా హాలీవుడ్ స్టార్స్ టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ హీరోలతో పోటీ పడబోతున్నారు. అమెరికాలోని క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ..............

Ram Charan-NTR : నా బ్రదర్ ఎన్టీఆర్, నేను కలిసి వాళ్ళతో పోటీ పడుతున్నాము.. చరణ్ ట్వీట్..

Ram Charan tweet as he feels happy with ntr on Critics Choice Super Awards Nominations

Updated On : February 26, 2023 / 12:04 PM IST

Ram Charan-NTR :  ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా విడుదలయి సెన్సేషన్ క్రియేట్ చేసి 11 నెలలు దాటింది. అయినా ఇంకా ఈ మూవీ పేరు ఇంటర్నేషనల్ లెవెల్లో మారుమోగుతోంది. ఇప్పటికే ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డుని దక్కించుకించుకుంది. ప్రఖ్యాత హాలీవుడ్ డైరెక్టర్స్ స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కెమెరూన్.. లాంటి పలువురు ప్రముఖులు రాజమౌళితో పాటు హీరో రామ్ చరణ్, ఎన్టీఆర్ లపై ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. ఇక RRR సినిమా ఇప్పుడు బోలెడన్ని ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకుంటుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ ముంగిట కూడా నామినేట్ అయింది. తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో ఏకంగా అయిదు అవార్డులు సాధించింది.

లేటెస్ట్ గా క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్ పోటీలో ఇప్పుడు యన్టీఆర్, రామ్ చరణ్ బెస్ట్ యాక్టర్స్ అవార్డు కోసం ఏకంగా హాలీవుడ్ స్టార్స్ టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ హీరోలతో పోటీ పడబోతున్నారు. అమెరికాలోని క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ కేటగిరీలో రామ్ చరణ్, ఎన్టీఆర్, టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్, నికోలస్ కేజ్ లు పోటీ పడుతున్నారు. ముగ్గురు హాలీవుడ్ స్టార్ హీరోలతో మన చరణ్, తారక్ పోటీపడుతుండటంతో అందరూ మరోసారి వీళ్ళిద్దర్నీ అభినందిస్తున్నారు.

Ramyakrishna : మహేష్-త్రివిక్రమ్ సినిమాలో రమ్యకృష్ణ.. ఏ పాత్రలో?

అయితే దీనిపై చరణ్ ట్వీట్ చేశాడు. క్రిటిక్స్ ఛాయస్ అవార్డ్స్ వాళ్ళు పోస్ట్ చేసిన నామినేషన్స్ లిస్ట్ ని రీట్వీట్ చేస్తూ.. నా బ్రదర్ ఎన్టీఆర్, నా పేర్లు బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ నామినేషన్స్ లో నిలవడం నాకు గౌరవంగా ఉంది. హాలీవుడ్ స్టార్స్ నికోలస్ కేజ్, బ్రాడ్ పిట్, టామ్ క్రూయిజ్ లతో పోటీ పడుతుండటం ఈ ఫీలింగ్ చాలా బాగుంది అని పోస్ట్ చేశారు. దీంతో చరణ్, ఎన్టీఆర్ అభిమానులు ఈ పోస్ట్ ని వైరల్ చేస్తున్నారు. ఇక ఈ అవార్డులని మార్చ్ 16న ప్రకటించనున్నారు.