Social Media : ఇన్‌స్టా ఫ్రెండ్ కోసం..! పేరెంట్స్‌కు చెప్పకుండా స్వీడన్ నుంచి ముంబైకి వచ్చిన 16ఏళ్ల బాలిక
సోషల్ మీడియాలో పరిచయమైన స్నేహితుడిని కలిసేందుకు 16 ఏళ్ల బాలిక సాహసం చేసింది. తన స్నేహితుడి కోసం స్వీడన్ నుంచి ముంబైకి ఒంటరిగా వచ్చేసింది.

Social Media Friend
Social Media Friend : సోషల్ మీడియాలో పరిచయమైన స్నేహితుడిని కలిసేందుకు 16 ఏళ్ల బాలిక సాహసం చేసింది. తన స్నేహితుడి కోసం స్వీడన్ నుంచి ముంబైకి ఒంటరిగా వచ్చేసింది. అతడిని కలిసింది.. స్వీడన్‌లో ఉన్న తల్లిదండ్రులు తమ కూతురు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె దేశం దాటి వెళ్లినట్లు గుర్తించిన అధికారులు సమాచారం సేకరించి ముంబై పోలీసులకు తెలిపారు. సదరు బాలిక ఫోటోతోపాటు, ఫోన్ నంబర్… అందించారు.
చదవండి : Heroin’s Social Media: సీనియర్ హీరోయిన్స్‌ను బీట్ చేస్తున్న యంగ్ బ్యూటీస్!
అరచేతిలోకి వచ్చిన టెక్ ప్రపంచాలతో మనుషుల మధ్య దూరాలు తగ్గిపోయాయి. పదహారేళ్ల అమ్మాయి ఆన్‌లైన్ యాక్టివిటీస్‌ను పరిశీలించిన పోలీసులు ఆమెకు ముంబైలో ఒక ఇన్ స్టాగ్రామ్ పరిచయమైన ఫ్రెండ్ ఉన్నట్టు గుర్తించారు. అతన్ని పోలీసులు విచారించగా, స్వీడన్ బాలిక ముంబై ట్రాంబే ఏరియాలోని చీతా క్యాంప్‌లో ఉన్నట్లు తెలిపాడు. అక్కడికి వెళ్లిన పోలీసులు బాలికను అదుపులోకి తీసుకొని స్వీడన్ ఎంబసీకి కబురందించారు. శుక్రవారం ముంబైకి వచ్చిన బాలిక కుటుంబ సభ్యులకు పోలీసులు ఆమెను అప్పజెప్పారు. టూరిస్టు వీసాపై ఆమె ఇండియాకు వచ్చింది.
చదవండి : Social Media Fraudsters : చదివింది టెన్త్ క్లాస్… ఆన్‌లైన్ మోసాల్లో మాస్టర్ డిగ్రీ