T20 World Cup 2021 : విరాట్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పాకిస్తాన్ టార్గెట్ 152

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ తలపడుతున్నాయి. టాస్ గెలిచి పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. క్వాలిటీ బౌలింగ్ తో భారత్ ను పాక్ కట్టడి చేసింది.

T20 World Cup 2021 : విరాట్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పాకిస్తాన్ టార్గెట్ 152

T20 World Cup 2021 India Vs Pakistan.. Pakistan Target

T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ తలపడుతున్నాయి. టాస్ గెలిచి పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. క్వాలిటీ బౌలింగ్ తో భారత్ ను పాక్ కట్టడి చేసింది. అయినా, ఇండియా బ్యాటర్లు పోరాటం చేసి పాక్ ముందు చాలెంజింగ్ టార్గెట్ ఉంచారు. నిర్ణీత ఓవర్లలో కోహ్లి సేన 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.

పాక్ బౌలర్లలో ముఖ్యంగా 21 ఏళ్ల పేసర్ షాహీన్ షా అఫ్రిదీ బంతితో నిప్పులు చెరిగాడు. 3 కీలక వికెట్లు తీశాడు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి వికెట్లు తీసింది అఫ్రిదీనే. 6 పరుగులకే ఇండియా రెండు వికెట్లు కోల్పోవడంతో భారత శిబిరంలో తీవ్ర నిరాశ నెలకొంది. ఇండియా ఫ్యాన్స్ దిగ్భ్రాంతికి గురయ్యారు.

Amazon లో రూ.70వేల ఖరీదైన ఫోన్ ఆర్డర్‌ చేస్తే అంట్లు తోమే సోప్ పంపారు

ఆదిలోనే టీమిండియాకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే కేఎల్ రాహుల్( 8 బంతుల్లో 3 పరుగులు) కూడా ఔటయ్యాడు. వీరిద్దరినీ అఫ్రిదీనే ఔట్ చేశాడు. 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇండియాను కోహ్లి, రిషబ్ పంత్ జోడి ఆదుకుంది. విరాట్ కోహ్లి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రెజర్ లోనూ రాణించాడు. హాఫ్ సెంచరీతో (49 బంతుల్లో 57 పరుగులు) జట్టును ఆదుకున్నాడు.

Porn : షాకింగ్.. పోర్న్ వీడియోలకు అలవాటుపడ్డ 11ఏళ్ల బాలురు.. దానికి ఒప్పుకోలేదని బాలిక హత్య

రిషబ్ పంత్ (30 బంతుల్లో 39 పరుగులు) రాణించాడు. పాక్ బౌలర్లలో అఫ్రిదీ 3 వికెట్లు తీశాడు. హసన్ అలీ రెండు వికెట్లు తీశాడు. షాబాద్ ఖాన్, రౌఫ్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో గెలవాలంటే పాకిస్తాన్ 152 పరుగులు చేయాలి.