Jawan : షారుఖ్ జవాన్ కథ నాదే అంటూ.. తమిళ నిర్మాత మండలిలో డైరెక్టర్ అట్లీపై ఫిర్యాదు..

తమిళ దర్శకుడు అట్లీ బాలీవుడ్ లో షారుఖ్ తో సినిమా చేస్తున్నాడు. జవాన్ అనే టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా కథ నాది అంటూ ఓ తమిళ నిర్మాత డైరెక్టర్ అట్లీపై తమిళ నిర్మాత మండలిలో.........

Jawan : షారుఖ్ జవాన్ కథ నాదే అంటూ.. తమిళ నిర్మాత మండలిలో డైరెక్టర్ అట్లీపై ఫిర్యాదు..

tamil producer complaints on director atlee regarding Jawan movie story

Jawan :  తమిళ దర్శకుడు అట్లీ బాలీవుడ్ లో షారుఖ్ తో సినిమా చేస్తున్నాడు. జవాన్ అనే టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో నయనతార హీరోయిన్ గా, విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి దశ షూటింగ్ లో ఉంది.

Ashwini Puneeth Rajkumar : ఇది పునీత్ కోరిక అంటూ.. కన్నడ ప్రజలకు పునీత్ రాజ్‌కుమార్ భార్య లేఖ..

తాజాగా ఈ సినిమా కథ నాది అంటూ ఓ తమిళ నిర్మాత డైరెక్టర్ అట్లీపై తమిళ నిర్మాత మండలిలో ఫిర్యాదు చేశాడు. గత కొన్ని రోజులుగా అట్లీ షారుఖ్ ఖాన్ తో తెరకెక్కిస్తున్న జవాన్ సినిమా కథ నేను 2006లో విజయ్ కాంత్ తో తెరకెక్కించిన పేరరసు సినిమా కథ ఒక్కటే, ఆ సినిమా కథని కాపీ కొట్టాడు అని తమిళ్ నిర్మాత మాణిక్యం నారాయణన్‌ ఆరోపణలు చేస్తున్నాడు. దీనిపై అట్లీ కానీ, ఆ చిత్ర నిర్మాతలు కానీ స్పందించకపోవడంతో తాజాగా తమిళ నిర్మాతల మండలిలో డైరెక్టర్‌ అట్లీపై మాణిక్యం నారాయణన్ ఫిర్యాదు చేశాడు. అయితే దీనిపై ఇప్పటివరకు అట్లీ స్పందించలేదు.