Pawan Kalyan: పవన్ కెరీర్‌లో పది రీమేక్ సినిమాలు.. ఈసారి ఫలితమేంటో?

పవన్ కళ్యాణ్.. కొత్త సబ్జెక్ట్స్ కన్నా.. మినిమం సక్సెస్ గ్యారంటీ ఉండే సినిమాలు చెయ్యడానికే ఎప్పుడూ ఇంట్రస్ట్ చూపిస్తారు. అందుకే పాతిక సినిమాల్లో 10కి పైగా రీమేక్స్ తోనే కెరీర్..

Pawan Kalyan: పవన్ కెరీర్‌లో పది రీమేక్ సినిమాలు.. ఈసారి ఫలితమేంటో?

Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. కొత్త సబ్జెక్ట్స్ కన్నా.. మినిమం సక్సెస్ గ్యారంటీ ఉండే సినిమాలు చెయ్యడానికే ఎప్పుడూ ఇంట్రస్ట్ చూపిస్తారు. అందుకే పాతిక సినిమాల్లో 10కి పైగా రీమేక్స్ తోనే కెరీర్ నింపేసుకున్నారు. కొన్ని రీమేక్స్ మాత్రం సూపర్ హిట్ అయితే.. మరికొన్ని మాత్రం డిజాస్టర్ అయ్యాయి. మరి లేటెస్ట్ గా మరో మల్టీస్టారర్ రీమేక్ చేస్తున్న వకీల్ సాబ్ కి ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతోంది..?

Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఉండొచ్చు??

పవర్ స్టార్ స్ట్రెయిట్ ఫిల్మ్స్ కన్నా.. రీమేక్స్ తోనే కెరీర్ లో సేఫ్ గేమ్ ఆడుతున్నారు. కెరీర్ లో చేసిన 26 సినిమాల్లో పవన్ కళ్యాణ్ 10 సినిమాలకు పైగా రీమేక్ చేసి రీమేక్ స్టార్ అనిపించుకుంటున్నారు. హిందీ, తమిళ్, మళయాళం ఇలా భాషతో సంబంధం లేకుండా సినిమాలు రీమేక్ చేస్తున్న పవన్ మరో పవర్ పుల్ రీమేక్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు.

Pawan Kalyan : అమెరికాలో 400కి పైగా థియేటర్లలో ‘భీమ్లా నాయక్’ విడుదల

పవన్ కళ్యాణ్.. సాగర్ చంద్ర డైరెక్షన్లో మళయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాని రీమేక్ చేసి రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. పృధ్విరాజ్, బిజుమీనన్ లీడ్ రోల్స్ లో మాస్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన అయ్యప్పనుమ్ సినిమాని రానాతో కలిసి మల్టీస్టారర్ గా ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో భీమ్లా నాయక్ క్యారెక్టర్ లో మాస్ పోలీస్ రోల్ చేస్తున్నపవర్ స్టార్ మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా చూపించబోతున్నారు.

Pawan Kalyan : రాబోయే సినిమాల డైరెక్టర్స్ తో పవన్ పిక్.. వైరల్ అవుతున్న ఫోటో..

సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత.. రిలీజ్ చేసిన సినిమా కూడా రీమేక్ మూవీయే. హిందీలో అమితాబ్ లీడ్ రోల్ లో చేసిన పింక్ ని వకీల్ సాబ్ టైటిల్ తో రీమేక్ చేశారు పవన్ కళ్యాణ్. కోర్ట్ రూమ్ డ్రామాగా రిలీజ్ అయిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కు పర్ ఫెక్ట్ కమ్ బ్యాక్ మూవీ అయ్యింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సినిమా కలెక్షన్ల రికార్డులు క్రియేట్ చేసింది.

Pawan Kalyan : ‘భవదీయుడు భగత్ సింగ్’ నుంచి క్రేజీ అప్‌డేట్.. పవన్‌ని కలిసిన హరీష్ శంకర్..

పవన్ కళ్యాణ్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా రిలీజ్ అయిన అజ్ఞాతవాసి సినిమాని అనఫీషియల్ రీమేక్ గానే తెరకెక్కించారు. ఫ్రెంచ్ మూవీ ద లార్గో వించ్ ని చిన్న చిన్న మార్పులు చేసి సినిమా తీసేశారు డైరెక్టర్ త్రివిక్రమ్. కెరీర్ లో 25వ సినిమాగా తెరకెక్కిన అజ్ఞాతవాసి.. తెలుగులో మాత్రం అస్సలు ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చెయ్యలేక.. బ్యాడ్ రివ్యూస్ అందుకుంది.

Bheemla Nayak : తమన్‌ని ట్రోల్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్.. అన్నీ థియేటర్లోనే అంటున్న తమన్

పవన్ కళ్యాణ్ క్లాస్ రోల్స్ కి బ్రేక్ ఇచ్చి మాస్ లుక్ లో ఫ్యామిలీ యాక్షన్ మూవీగా వచ్చిన మూవీ కాటమరాయుడు. శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన కాటమరాయుడు కూడా తమిళ్ లో అజిత్ హీరోగా వచ్చిన వీరం సినిమాకి రీమేక్ గా వచ్చింది. తమిళ్ లో అజిత్ కి పెద్ద బ్రేక్ ఇచ్చిన ఈ సినిమా పవన్ కు మాత్రం డిజాస్టర్ టాక్ తెచ్చిపెట్టింది.

Bheemla Nayak: ‘నేను ఇవతల ఉంటే చట్టం.. అవతలికొస్తే కష్టం.. వాడికి’

పవన్ కళ్యాణ్ కెరీర్ లో సూపర్ హిట్ అయిన సినిమా గబ్బర్ సింగ్. ఫ్లాపుల నుంచి బయటికి తీసుకొచ్చిన ఈ సినిమాని హరీష్ శంకర్ డైరెక్షన్లో చేశారు పవన్ కళ్యాణ్. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కి లిఫ్ట్ ఇచ్చిన దబంగ్ సినిమాని గబ్బర్ సింగ్ గా చేసిన పవన్ కళ్యాణ్.. బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

Bheemla Nayak: భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫిబ్రవరి 25నే వచ్చేస్తోంది

పవన్ కళ్యాణ్ రిస్కీ సబ్జెక్ట్స్ ని ఎప్పుడూ రీమేక్ చెయ్యలేదు. సింపుల్ స్టోరీతో కామన్ ఆడియన్ కి రీచ్ అయ్యే కాన్సెప్ట్ తోనే సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ ఫస్ట్ టైమ్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ని సెలక్ట్ చేసుకుని.. దాన్ని అంతే ఈజ్ గా క్యారీ చేసి మంచి హిట్ అందుకున్నారు.

Prabhas : ‘రాధేశ్యామ్’కి అమితాబ్ వాయిస్ ఓవర్.. సినిమాకి మరింత హైప్

సబ్జెక్ట్ బావుంటే లాంగ్వేజ్ ని పెద్దగా పట్టించుకోని పవన్ కళ్యాణ్ .. బాలీవుడ్ సినిమాల్ని కూడా బాగానే రీమేక్ చేశారు. హిందీలో సూపర్ హిట్ అయిన కాంట్రవర్షియల్ సినిమా అక్షయ్ కుమార్ ఓమై గాడ్ ని వెంకటేష్ తో కలిసి గోపాల గోపాల అంటూ రీమేక్ మల్టీస్టారర్ చేశారు. హిందీలో ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

Bheemla Nayak: భీమ్లాతో బ్రహ్మీ కామెడీ ట్రాక్.. త్రివిక్రమ్ సెంటిమెంట్?

సీరియస్ సినిమాల్నేకాకుండా కొన్ని కొన్ని సార్లు.. ఎక్స్ పెరిమెంటల్ సినిమాలు కూడా రీమేక్ చేశారు పవన్. బాలీవుడ్ లో సైఫ్ అలీఖాన్ హీరోగా మంచి సక్సెస్ అయిన లవ్ ఆజ్ కల్ సినిమాని తీన్ మార్ టైటిల్ తో రీమేక్ చేశారు పవన్ కళ్యాణ్. పవన్.. డ్యూయల్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా హిందీలో హిట్ అయినా.. తెలుగు ఆడియన్స్ కి అంతగా కనెక్ట కాలేకపోయింది.

Mega Heroes: థియేటర్ల మీద మెగా హీరోల దండయాత్ర.. మేజర్ షేర్ వీళ్లదే!

అప్పుడప్పుడు ఫ్లాపులొస్తున్నా కూడా పవన్ రీమేక్ లు చెయ్యడం మాత్రం ఆపలేదు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన తిరుమాచి సినిమాని అన్నవరంగా రీమేక్ చేసి డీసెంట్ హిట్ అందుకున్నారు పవన్. అప్పటి వరకూ సెంటిమెంట్ జోలికి పెద్దగా వెళ్లని పవన్ కళ్యాణ్.. అన్నవరంలో అన్నగా సిస్టర్ సెంటిమెంట్ ని బాగా పండించారు.

Mega Family: మెగా యంగ్ హీరోస్.. అంతా ఒకే ఫ్రేములో!

ఇక పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన ఖుషీ సినిమా.. పవర్ స్టార్ మ్యానియాని క్రియేట్ చేసి సెన్సేషన్ అయ్యింది. ఎస్.జె సూర్య తమిళ్ లో చేసిన ఖుషీ సినిమాని యాజ్ ఇట్ ఈజ్ గా టైటిల్ తో సహా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాతో యూత్ లో విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు పవర్ స్టార్.

Megastar : యువ దర్శకుడితో మరో సినిమా ఫిక్స్ చేసిన మెగాస్టార్

కెరీర్ స్టార్టింగ్ లోనే సేఫ్ సైడ్ కోసం రీమేక్ వైపు వెళ్లారు పవన్ కళ్యాణ్. కెరీర్ లో యూత్ ఓరియంటెడ్ మూవీస్ కాకుండా సెంటిమెంట్ సినిమాలతో యూత్, ఫ్యామిలీని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్.. సుస్వాగతం సినిమాని కూడా రీమేక్ చేశారు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన లవ్ టుడే సినిమాని తెలుగులో సుస్వాగతం సినిమాగా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

Mega Movies : మెగా సందడి.. మూడు నెలలు.. ఆరు సినిమాలు..

కెరీర్ లో ఫస్ట్ రీమేక్ చేసిన మూవీ గోకులంలోసీత. కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా వచ్చిన గోకులంలో సీత సినిమా.. తమిళ్ లోనే వచ్చిన గోకులత్తైల్ సీతకు రీమేక్ గా వచ్చింది. పవన్ కళ్యాణ్, రాశి జంటగా తెరకెక్కిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఇలా.. కెరీర్ లో 10 సినిమాల్ని రీమేక్ చేసి ఎక్కువ హిట్లే అందుకున్నారు పవన్ కళ్యాణ్.