Film Shootings : షూటింగ్స్ ఆపే ప్రసక్తే లేదు.. తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వ్యతిరేకత..

తెలంగాణ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. ''అకస్మాత్తుగా సినిమా షూటింగ్స్ ఆపేస్తే.......

Film Shootings : షూటింగ్స్ ఆపే ప్రసక్తే లేదు.. తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వ్యతిరేకత..

Tfcc

Film Shootings :  టాలీవుడ్ సమస్యలు రోజు రోజుకి ముదురుతున్నాయి. ఉన్న సమస్యలు చాలవన్నట్టు ప్రొడ్యూసర్ గిల్డ్, ప్రొడ్యూసర్ కౌన్సిల్, తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. టాలీవుడ్ సమస్యలపై పరిష్కారం దొరికే వరకు షూటింగ్స్ బంద్ అన్న ప్రొడ్యూసర్స్ గిల్డ్ పై నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ వ్యతిరేకిస్తున్నారు. సమస్యలకి వారు ప్రతిపాదించిన పరిష్కారాలపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న నిర్మాతలు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ కూడా షూటింగ్స్ బంద్ ని వ్యతిరేకిస్తున్నారు.

Karan Johar : పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్2 సినిమాలు బాలీవుడ్ ని కప్పేశాయి..

దీనిపై సమావేశం నిర్వహించి తెలంగాణ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. ”అకస్మాత్తుగా సినిమా షూటింగ్స్ ఆపేస్తే కార్మికులతోపాటు, పరిశ్రమలో అందరికీ ఇబ్బందే. షూటింగ్స్ ఆపే ప్రసక్తే లేదు. ఎవరైనా ఆపాలని ప్రయత్నిస్తే మా టీఎఫ్‌సీసీ తరపున అడ్డుకుంటాము. కరోనాతో ఇప్పటికే కార్మికులు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ షూటింగ్స్ ఆపేస్తే తీవ్రంగా నష్టపోతారు. కొంతమంది తమ స్వార్థం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. టికెట్‌ ధరలు, థియేటర్లలో అమ్మే స్నాక్స్, పాప్ కార్న్ ధరలు తగ్గిస్తే మళ్లీ ప్రేక్షకులు థియేటర్లకి వస్తారు” అని తెలిపారు. ఇలా షూటింగ్స్ బంద్ పై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడటంతో టాలీవుడ్ సమస్యలు మరింత జటిలం అవుతున్నాయి.