Terrorists: ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో గత 24 గంటల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

Terrorists: ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

Terrorists: జమ్మూకశ్మీర్‌లో గత 24 గంటల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కుల్గామ్‌లో ఇద్దరు ఉగ్రవాదులను హతం చెయ్యగా.., శ్రీనగర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్‌ నేటికి రెండో రోజు. కుల్గామ్‌లో హతమైన ఉగ్రవాదులను హిజ్బుల్ కమాండర్ షిరాజ్ మౌల్వీ, యావర్ భట్‌లుగా గుర్తించారు.

యువతను మభ్యపెట్టి ఉగ్రవాదులను తయారుచేసే పనిలో షిరాజ్ ఉన్నాడు. అనేకమంది అమాయకుల హత్యకు పాల్పడ్డాడు. అదే సమయంలో శ్రీనగర్‌లో హతమైన ఉగ్రవాదిని పుల్వామాకు చెందిన అమీర్ రియాజ్‌గా గుర్తించారు. హత్యకు గురైన అమీర్ రియాజ్‌కు గజ్వాతుల్ హింద్ అనే ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉంది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫిదాయీన్ దాడికి ఉగ్రవాది అమీర్ రియాజ్ కారణం.

అంతకుముందు, జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్, కుల్గామ్ జిల్లాల్లో భద్రతా దళాలు నిర్వహించిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక్కడి బెమినా ప్రాంతంలోని హమ్దానియా కాలనీలో ఎన్‌కౌంటర్ జరిగినట్లుగా అధికారులు వెల్లడించారు.

ఎన్‌కౌంటర్‌లో గుర్తుతెలియని ఉగ్రవాది హతమైనట్లు కశ్మీర్ డివిజనల్ పోలీసులు అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో వెల్లడించారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండగా ఒక ఏకే రైఫిల్‌తో పాటు కొన్ని మందుగుండు సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Turkish : మాయలో పడకుండా..పెద్ద ఐస్ క్రీంతో పారిపోయాడు, వీడియో వైరల్

ఫైనల్ రిపోర్ట్ వచ్చే వరకు ఎన్‌కౌంటర్‌ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. “సిఆర్‌పిఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) క్యాంపు సబ్ డివిజనల్ పోలీసు అధికారి కార్యాలయం సమీపంలో ఈ ఆపరేషన్ జరుగుతోంది,” అని అధికారులు చెబుతున్నారు.

అంతకుముందు, దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు సోదాలు నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు తమపై కాల్పులు జరిపారని, భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయని, ఆ తర్వాత ఎన్‌కౌంటర్ ప్రారంభమైనట్లు చెప్పారు. ఈ సమయంలో ఒక ఉగ్రవాది హతమయ్యాడని, ఉగ్రవాది ఎవరనేది ఇంకా నిర్ధారణ కాలేదని, అతడు ఏ గ్రూపుకు చెందినవాడో తెలియరాలేదని చెప్పారు.

COVID-19 Guidelines: కేంద్రం కొత్త కోవిడ్ మార్గదర్శకాలు.. ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా టెస్ట్ అక్కర్లేదు