Revanth Reddy : సిట్ నోటీసులకు భయపడను.. కేటీఆర్ కు కూడా నోటీసులు ఇవ్వాలి : రేవంత్ రెడ్డి

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సిట్ నోటీసులపై రేవంత్ రెడ్డి స్పందించారు. సిట్ నోటీసులు ఊహించిందేనని అన్నారు.

Revanth Reddy : సిట్ నోటీసులకు భయపడను.. కేటీఆర్ కు కూడా నోటీసులు ఇవ్వాలి : రేవంత్ రెడ్డి

Revanth Reddy (3)

Revanth Reddy : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సిట్ నోటీసులపై రేవంత్ రెడ్డి స్పందించారు. సిట్ నోటీసులు ఊహించిందేనని అన్నారు. నోటీసులను స్వాగతిస్తున్నామని చెప్పారు. సిట్ నోటీసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. తనను వేధించాలనే నోటీసులు ఇచ్చిందని తెలిపారు. సిట్ కు తన దగ్గర ఉన్న ఆధారాలు ఇస్తానని పేర్కొన్నారు. సిట్ నోటీసులు ఇంకా తనకు అందలేదన్నారు. అలాగే కేటీఆర్ కు కూడా నోటీసులు ఇవ్వాలన్నారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దూకుడు పెంచింది. పేపర్ లీక్ అంటూ ఆరోపణలు చేస్తున్నవారికి నోటీసులు ఇస్తోన్నారు. ఇందులో భాగంగా గ్రూప్-1 ప్రశ్నాపత్రం లీక్ పై ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు ఇచ్చారు. పేపర్ లీక్ కేసుకు సంబంధించి తన దగ్గరున్న ఆధారాలు ఇవ్వాలంటూ రేవంత్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.  ఒకే మండలంలో 100 మందికి ర్యాంకులు వచ్చాయని రేవంత్ పేర్కొన్నారు.

SIT Notice : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు

గ్రూప్-1లో కేటీఆర్ పీఏ స్వంత మండలంలో వంద మందికి వందకు పైగా మార్కులు వచ్చాయని రేవంత్ ఆరోపణలు చేశారు. పేపర్ లీక్ పై రేవంత్ చేసిన ఆరోపణలకు గానూ ఆయనకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే రేవంత్ రెడ్డి కార్యాలయ అధికారులు మాత్రం సిట్ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని అంటున్నారు.