Palla Rajeshwar Reddy : జైలుకు వెళ్లొచ్చినా రేవంత్ రెడ్డి తీరు మారలేదు : పల్లా

రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముందు తన పార్టీని సరిచేసుకోవాలని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం గురించి రేవంత్ కు ఏం తెలుసని ప్రశ్నించారు.

Palla Rajeshwar Reddy : జైలుకు వెళ్లొచ్చినా రేవంత్ రెడ్డి తీరు మారలేదు : పల్లా

Palla Rajeshwar

Palla Rajeshwar Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జైలుకు వెళ్లొచ్చినా రేవంత్ రెడ్డి తీరు మారలేదన్నారు. రేవంత్ తన భాష మార్చుకోవాలని సూచించారు. భాష మార్చుకోకుంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. కేసీఆర్, కేటీఆర్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముందు తన పార్టీని సరిచేసుకోవాలని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం గురించి రేవంత్ కు ఏం తెలుసని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కేంద్రం చూస్తోందన్నారు. రైతులను, మిల్లర్లను ఇబ్బంది పెట్టాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

Palla Fire on Etala : ఈటలకు ఉన్నది ఆత్మగౌరవం కాదు..ఆస్తులపై గౌరవం : పల్లా రాజేశ్వర్ రెడ్డి

రేవంత్ రెడ్డి ఉన్న పార్టీకి భవిష్యత్ ఉండదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. చంద్రబాబుకు ఏజెంట్ గా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ మంచోడని కాంగ్రెస్ లో ఒక్కరైనా చెప్తారా అని అడిగారు.

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. తెలంగాణ ధాన్యం కొనబోమని కేంద్రం మోసం చేసిందని మండిపడ్డారు. నష్టమైన రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొంటోందని తెలిపారు. బీజేపీ నేతల చిల్లర మాటలను రైతులు అర్థం చేసుకోవాలన్నారు.