TTD : గో ఆధారిత ఉత్పత్తులు.. మొత్తం 15 రకాలు

తిరుపతిలో టీటీడీకి చెందిన డీపీడబ్ల్యూ స్టోర్‌లో పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని నెలకొల్పారు. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా... గోమాత ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేందుకు.

TTD : గో ఆధారిత ఉత్పత్తులు.. మొత్తం 15 రకాలు

Ttd

TTD Panchagavya : గో ఆధారిత ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది టీటీడీ. 2022, జనవరి 27వ తేదీ గురువారం నుంచే గో ఉత్పత్తులను విక్రయించేందుకు రెడీ అయ్యింది. మొత్తం 15 రకాల పంచగవ్య ఉత్పత్తులను తయారు చేసింది. నమామి పేరిట భక్తులకు ఈ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తోంది. టీటీడీ చైర్మన్‌ , టీటీడీ ఈవో చేతుల మీదుగా రేపు వీటిని ప్రారంభించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు. గత అక్టోబర్‌లో టీటీడీ ఆధ్వర్యంలో జాతీయ గో మహాసమ్మేళనం నిర్వహించారు. ఈ సమయంలోనే గో ఆధారిత ఉత్పత్తులను ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.

Read More : Ayodhya Ram Temple: అయోధ్య రామాలయంలో తిరుమల తరహా భద్రత

అందుకు అనుగుణంగానే.. తిరుపతిలో టీటీడీకి చెందిన డీపీడబ్ల్యూ స్టోర్‌లో పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని నెలకొల్పారు. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా… గోమాత ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేందుకు.. పంచ గవ్యాలతో పలురకాల గృహావసర ఉత్పత్తులు తయారు చేయాలని భావించారు. ఈ సదుద్దేశంతోనే టీటీడీ ఈ రంగంలోకి అడుగుపెట్టింది. కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్‌ ఆయుర్వేద ఫార్మసీ సాంకేతిక సహకారాన్ని తీసుకుంది టీటీడీ. మొత్తం 15 రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.

Read More : Drone Fall : రిపబ్లిక్ డే వేడుక‌ల్లో డ్రోన్ కలకలం.. ఇద్ద‌రికి గాయాలు

ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రం, ఆవుపేడ.. ఇవే పంచగవ్యాలు. ఇవి శరీరానికి ఉపయోగపడే దివ్య ఔషధాలు. ఆయుర్వేదపరంగా ఈ ఐదింటికి ప్రత్యేక గుర్తింపు ఉంది. వీటితోనే 15రకాల ప్రొడక్ట్స్‌ తయారు చేసింది టీటీడీ.. హెర్బల్‌ సోప్‌, ధూప్‌ చూర్ణం, అగరబత్తీ, హెర్బల్‌ షాంపూ, హెర్బల్‌ టూత్‌ పౌడర్‌, విభూది, నాజిల్‌ డ్రాప్స్‌, హెర్బల్‌ ఫేస్‌ ప్యాక్‌, హెర్బల్‌ ఫ్లోర్‌ క్లీనర్‌, ధూప్‌చూర్ణం సాంబ్రాణి, ధూప్‌ కోన్‌, ధూప్‌ స్టిక్స్‌, గో అర్కం, పిడకలు, కౌడంగ్‌ లాగ్‌ తయారు చేస్తున్నారు. పంచ భూతాల సాక్షిగా ఐదు హోమగుండాలు ఏర్పాటు చేశారు. వాటితో ఎంతో పవిత్రంగా విభూది తయారు చేస్తున్నారు. అగరబత్తీల తరహాలోనే ఈ ఉత్పత్తులను కూడా భక్తులకు విక్రయించనున్నారు. టీటీడీ పాలక మండలి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి చేతుల మీదుగా ఈ పంచగవ్య ఉత్పత్తుల కేంద్రం గురువారం ప్రారంభంకానుంది. భక్తులకు గో ఆధారిత ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి.