Tokyo Paralympics : టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ కు మరో రెండు పతకాలు

టోక్యో పారాలింపిక్స్‌లో భారత పతకాల వేట కొనసాగుతోంది. ఇండియాకు మ‌రో రెండు మెడ‌ల్స్ ద‌క్కాయి. భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం, మరో రజతం చేరాయి. ఇండియా ప‌త‌కాల సంఖ్య 15కు చేరింది.

Tokyo Paralympics : టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ కు మరో రెండు పతకాలు

Paralympics (1)

Two more medals for India : టోక్యో పారాలింపిక్స్‌లో భారత పతకాల వేట కొనసాగుతోంది. పారాలింపిక్స్‌లో ఇండియాకు మ‌రో రెండు మెడ‌ల్స్ ద‌క్కాయి. భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం, మరో రజతం చేరాయి. షూట‌ర్ మ‌నీశ్ న‌ర్వాల్ గోల్డ్‌ మెడ‌ల్ గెలిచాడు. పీ4 మిక్స్‌డ్ 50మీట‌ర్ల పిస్తోల్ ఈవెంట్‌లో మ‌నీశ్ అద్భుత ప్రద‌ర్శన ఇచ్చాడు. టాప్‌లో నిలిచిన అత‌ను స్వర్ణ ప‌త‌కాన్ని కైవ‌సం చేసుకున్నాడు. ఇక ఇదే ఈవెంట్‌లో సింఘ‌రాజ్‌కు సిల్వర్ మెడ‌ల్ ద‌క్కంది.

దీంతో పారాలింపిక్స్‌లో ఇండియా ప‌త‌కాల సంఖ్య 15కు చేరింది. మ‌హిళ‌ల షూటింగ్ ఈవెంట్‌లో అవ‌నిలేఖరా ఇప్పటికే రెండు మెడ‌ల్స్ సాధించింది. దీంతో ఒక షుటింగ్‌ నుంచే భారత్‌ ఖాతాలో నాలుగు మెడల్స్‌ వచ్చినట్లయింది. ఇందులో ఏకంగా రెండు గోల్డ్‌ మెడల్స్‌ ఉన్నాయి. ఈ పారాలింపిక్స్‌లో భారత్‌ గెలిచిన మూడు స్వర్ణ పతకాల్లో రెండు షుటింగ్‌ నుంచే ఉన్నాయి.

50మీ పిస్తోల్ SH1 ఫైన‌ల్లో షూట‌ర్ మ‌నీశ్‌.. 218.2 పాయింట్లు స్కోర్ చేశాడు. దీంతో అత‌ను పారాలింపిక్స్ చ‌రిత్రలో కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఈ స్కోర్ పారాలింపిక్స్‌లో రికార్డుగా నిలిచింది. అంతేకాదు.. వ‌ర‌ల్డ్ రికార్డు కూడా మ‌నీశ్ ఖాతాలోనే చేరింది. మ‌రో షూట‌ర్ అదాన సింగ‌రాజ్ ఈ ఈవెంట్‌లో 216.7 పాయింట్లు స్కోర్ చేశారు. దీంతో అతనికి సిల్వర్‌ మెడల్ దక్కింది.

టోక్యో పారాలింపిక్స్ లో షూటింగ్ విభాగంలో హర్యానా అథ్లెట్లు స్వర్ణం, రజత పతకాలు సాధించారు. పారాలింపిక్స్ పతక విజేతలకు హర్యానా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. బంగారు పతకం గెలిచిన మనీశ్ నర్వాల్ కు రూ.6 కోట్లు ప్రకటించింది. రజత పతకం సాధించిన సింఘ్ రాజ్ అదానాకు రూ.4 కోట్లు ప్రకటించింది.