CM KCR : కేసీఆర్ ప్రకటనపై ఉత్కంఠ

ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన అన్ని వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. రేపు ఉదయం 10 గంటలకు శాసనసభ వేదికగా కీలక ప్రకటన చేస్తానని వనపర్తి బహిరంగ సభ లో సీఎం ప్రకటించడం రాజకీయంగా హాట్ హాట్

CM KCR : కేసీఆర్ ప్రకటనపై ఉత్కంఠ

Cm Kcr On Unemployment

CM KCR :  ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన అన్ని వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. రేపు ఉదయం 10 గంటలకు శాసనసభ వేదికగా కీలక ప్రకటన చేస్తానని వనపర్తి బహిరంగ సభ లో సీఎం ప్రకటించడం రాజకీయంగా హాట్ హాట్ గా మారింది. ఉద్యోగాల భర్తీ విషయంలోనే సీఎం అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేయనున్నారు.

ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. విపక్షాలు చేస్తున్న వాదనలు పట్టించుకోక పోయినా…. ప్రభుత్వ పరంగా నిరుద్యోగ యువతకు చేరువయ్యేందుకు సర్కారు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగ యువతకు సంబంధించి బుధవారం అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్నట్లు ప్రకటించారు.

దీంతో సీఎం ప్రకటన ఎలా వుంటుందన్న అంచనాలు మొదలయ్యాయి. ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగాల భర్తీ కోసం తీసుకోవాల్సిన చర్యలపై దాదాపు ఏడాదికాలంగా కసరత్తు చేసింది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి సాంకేతికంగా ఇబ్బందులు సృష్టించే జోనల్ వివాదానికి కేంద్రం ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అయింది.

రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై సర్కార్ లెక్కలు తీసింది. దీనికి అనుగుణంగా ఎలాంటి చర్యలు చేపట్టాలని అంశంపై కసరత్తు కూడా పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రూపొందించిన ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు 60 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జోన్ ల వారిగా ఖాళీలపై స్పష్టత వస్తే ఉద్యోగాల భర్తీ సంఖ్య భారీగా అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఉద్యోగాల భర్తీ చేస్తే జీతభత్యాల కోసం ఈ బడ్జెట్ లో సుమారు 4 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది.
Also Read : Ongole Drugs : చెన్నైలో తీగలాగితే ఒంగోలులో బయటపడ్డ డ్రగ్స్ బాగోతం
నిర్ణీత గడువు కంటే ముందుగానే ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఇప్పుడు మొదలు పెడితే ఉద్యోగాలు భర్తీ అయ్యే వరకు కనీసం ఏడాది సమయం పట్టే అవకాశం ఉంటుందని సర్కార్ అంచనా వేస్తున్నట్లు తెలుస్తుంది. ఉద్యోగాల భర్తీని దృష్టిలో ఉంచుకొని వెనుకబడిన వర్గాల అభ్యర్థుల కోసం మరోసారి పదేళ్ల వయోపరిమితిని ప్రభుత్వం ఇటీవల పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Also Read : TS Covid Update : తెలంగాణలో కొత్తగా 91 మంది కోవిడ్ కేసులు నమోదు
నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించినా…..బడ్జెట్ లో నిరుద్యోగ భృతి కి ప్రత్యేకంగా కేటాయింపులు జరుపలేదు.ఈ కారణంగా నిరుద్యోగ భృతి విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడం లేదు. దీనిపై విధానాలు మాత్రం ఖరారు చేసేందుకు ఓ కమిటీని నియమించే ఛాన్స్ కనిపిస్తోంది. ఏది ఏమైనా రేపు ముఖ్యమంత్రి నిరుద్యోగులకు చెప్పబోయే తీపి కబురు ఎంటా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.