Liger: లైగర్‌కు రూ.200 కోట్లు ఆఫర్.. అబ్బే చాలదంటున్న విజయ్!

ఆర్ఆర్ఆర్.. సాహో.. కేజేఎఫ్2 మాత్రమే కాదు.. మరో దక్షణాది సినిమా కూడా యావత్ ఇండియా సినిమా మీద అలెర్ట్ క్రియేట్ చేసింది. అదే రౌడీ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా లైగర్. విజయ్ ఫైటర్ గా కనిపించనున్న ఈ సినిమాను పూరి భారీ లెవల్లో తెరకెక్కిస్తున్నాడు.

Liger: లైగర్‌కు రూ.200 కోట్లు ఆఫర్.. అబ్బే చాలదంటున్న విజయ్!

Liger

Liger: ఆర్ఆర్ఆర్.. సాహో.. కేజేఎఫ్2 మాత్రమే కాదు.. మరో దక్షణాది సినిమా కూడా యావత్ ఇండియా సినిమా మీద అలెర్ట్ క్రియేట్ చేసింది. అదే రౌడీ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా లైగర్. విజయ్ ఫైటర్ గా కనిపించనున్న ఈ సినిమాను పూరి భారీ లెవల్లో తెరకెక్కిస్తున్నాడు. విజయ్, పూరి జగన్నాథ్ ఇద్దరి కెరీర్లో ఇదే అతిపెద్ద భారీ బడ్జెట్ సినిమా కాగా ఈ సినిమా ఖర్చు మొత్తం రూ.125 కోట్లని ప్రచారం జరుగుతుంది.

బాలీవుడ్ స్టార్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కరణ్ జోహార్ కూడా తోడవడంతో మొత్తం ఇండియన్ సినీ పరిశ్రమలో భారీ హైప్ సొంతం చేసుకుంది. కాగా.. ఈ సినిమాపై భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులకు సుమారు రూ. 200 కోట్ల వరకు ఆఫర్ చేసినా పూరి బృందం థియేటర్లలో రిలీజ్ చేశాకే ఓటీటీ గురించి ఆలోచిస్తామని.. ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందని ఓ ప్రచారం తెగ చక్కర్లు కొట్టింది.

కాగా.. దీనిపై స్పందించిన విజయ్ దేవరకొండ తనదైన స్టైల్ లో రిప్లై ఇచ్చాడు. ప్రచారం జరుగుతున్నట్లుగా అది చాలా తక్కువ మొత్తమన్న విజయ్ థియేటర్లలో అంతకుమించి చూపిస్తామని చెప్పాడు. విజయ్ సమాధానంతో ఈ సినిమా అంతకు మించే వసూలు చేస్తుందని.. కేవలం థియేటర్స్ లోనే విడుదల అవుతుంది అని ఖరారైంది. మరి ఈ స్థాయిలో నమ్మకం ఉన్న సినిమా విజయ్ ను ఏ రేంజ్ కి తీసుకెళ్తుందో.. పూరికి ఏ స్థాయి పేరు తెస్తుందో చూడాల్సిఉంది.